OpenAI | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చాట్ జీపీటీలో వినియోగధరలు తగ్గింపు..
OpenAI | ఓపెన్‌ఏఐ తన జీపీటీ 5.6 మోడల్ ఫ్యామిలీకి సంబంధించిన ధరలను భారీగా తగ్గించింది. ఇందులో జీపీటీ 5.6 లూనా ధరను 80 శాతం, జీపీటీ 5.6 టెర్రా ధరను 20 శాతం తగ్గించింది. మోడళ్ల సామర్థ్యం, ఇన్‌ఫరెన్స్ సిస్టమ్‌లు, అలాగే ఏజెంట్ వర్క్‌ఫ్లోల్లో చేపట్టిన మెరుగుదల కారణంగా ఏఐ పనులను పూర్తి చేయడానికి అవసరమైన సమయం, ఖర్చు గణనీయంగా తగ్గిందని సంస్థ వెల్లడించింది.
Technology | Published On Jul 31, 2026, 3.47 pm IST
OpenAI | ఓపెన్‌ఏఐ తన జీపీటీ 5.6 మోడల్ ఫ్యామిలీకి సంబంధించిన ధరలను భారీగా తగ్గించింది. ఇందులో జీపీటీ 5.6 లూనా ధరను 80 శాతం, జీపీటీ 5.6 టెర్రా ధరను 20 శాతం తగ్గించింది. మోడళ్ల సామర్థ్యం, ఇన్‌ఫరెన్స్ సిస్టమ్‌లు, అలాగే ఏజెంట్ వర్క్‌ఫ్లోల్లో చేపట్టిన మెరుగుదల కారణంగా ఏఐ పనులను పూర్తి చేయడానికి అవసరమైన సమయం, ఖర్చు గణనీయంగా తగ్గిందని సంస్థ వెల్లడించింది. లూనా, టెర్రా ధరల తగ్గింపు ప్రభావం కోడెక్స్, చాట్‌జీపీటీ వర్క్‌లోని చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ వినియోగ పరిమితులపైనా కనిపించనుంది. ఈ రెండు మోడళ్ల వినియోగానికి ఇప్పటి నుంచి తక్కువ క్రెడిట్‌లు మాత్రమే వినియోగంలోకి వస్తాయి. జీపీటీ 5.6 లూనా టూల్ వినియోగం, మల్టీ స్టెప్ వర్క్‌ఫ్లోలకు మద్దతు ఇస్తూ అధిక పరిమాణంలో పనులను వేగంగా నిర్వహించేందుకు పనిచేస్తుంది. జీపీటీ 5.6 టెర్రా రోజువారీ అవసరాల పనుల కోసం అనుకూలంగా ఉంటుంది.
కొత్తగా ఫాస్ట్ మోడ్..
కాగా జీపీటీ 5.6 సోల్ కోసం ఏపీఐలో కొత్తగా ఫాస్ట్ మోడ్ ను ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటివరకు ఉన్న ప్రయారిటీ ప్రాసెసింగ్ స్థానాన్ని భర్తీ చేసింది. స్టాండర్డ్ ప్రాసెసింగ్‌తో పోలిస్తే ఫాస్ట్ మోడ్ 2.5 రెట్లు వేగాన్ని అందిస్తుందని, అయితే ధర మాత్రం రెండు రెట్లు ఉంటుందని తెలిపింది. మోడల్ తెలివితేటల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రయారిటీగా ఉన్న ఏపీఐ రిక్వెస్ట్‌లు ఆటోమేటిక్‌గా ఫాస్ట్ మోడ్‌లోనే కొనసాగుతాయి. జీపీటీ 5.6 సామర్థ్యం పెరగడానికి మోడళ్లను, ఇన్‌ఫరెన్స్ సిస్టమ్‌లను, టూల్స్, కాంటెక్స్ట్‌తో మోడళ్లను అనుసంధానించే ఏజెంట్ సిస్టమ్‌లను ఆప్టిమైజ్ చేసినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. హార్డ్‌వేర్ వినియోగాన్ని మెరుగుపరిచే రూటింగ్, టోకెన్ జనరేషన్‌ను మరింత సమర్థవంతంగా చేసే ప్రొడక్షన్ సాఫ్ట్‌వేర్, ఇప్పటికే పూర్తైన పనిని మళ్లీ చేయకుండా ఉండే మెరుగైన కాంటెక్స్ట్ మేనేజ్‌మెంట్, అలాగే పనులకు అవసరమైన సమయం, టోకెన్ వినియోగం, కంప్యూటింగ్ వనరులను తగ్గించడం వంటి మార్పులు ఇందులో భాగమని వివరించింది.
కొత్త ధరలు త్వరలోనే ఏడబ్ల్యూఎస్‌లో కూడా అమల్లోకి రానున్నాయి. జీపీటీ 5.6 సోల్ కోసం ఫాస్ట్ మోడ్ ఇప్పటికే ఏపీఐలో అందుబాటులో ఉండగా, కోడెక్స్‌లోని ఫాస్ట్ ఆప్షన్ తో అనుసంధానంగా పనిచేస్తుంది.
తాజావార్తలు
- ●Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం
- ●Vande Bharat | వందేభారత్‌లో తొలిసారి గుండె తరలింపు
- ●Nishikant Dubey | రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నారు : బీజేపీ ఎంపీ
- ●CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో 'పెద్ది' పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్ రెడ్డి
- ●Indian Railway | తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ అమలు
- ●Web Series Review | అబ్జెక్షన్ మై లార్డ్ రివ్యూ - జీ 5 ఓటీటీలో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Teenmar Mallanna | మా మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి సైనికుడు.. ఇక కత్తెర గుర్తుతో చరిత్ర మారుస్తాం

Vande Bharat | వందేభారత్‌లో తొలిసారి గుండె తరలింపు

Nishikant Dubey | రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నారు : బీజేపీ ఎంపీ

CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో 'పెద్ది' పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్ రెడ్డి






