Jana Nayagan Collection | జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్ – దళపతి విజయ్ ఆ రెండు డిజాస్టర్ల కంటే తక్కువే!
భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన దళపతి విజయ్ జననాయగన్ తొలిరోజే దారుణంగా నిరాశపరిచింది. వంద కోట్ల మార్కును కూడా టచ్ చేయలేకపోయింది. గురువారం రోజు జననాయగన్‌కు వరల్డ్ వైడ్‌గా 78 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు వెర్షన్ కేవలం 2.75 కోట్ల కలెక్షన్స్‌ను మాత్రమే దక్కించుకుంది.
Entertainment | Published On Jul 24, 2026, 11.22 am IST
Jana Nayagan Collections | తమిళనాడు సీఎం దళపతి విజయ్ చివరి మూవీ జననాయగన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానులు అంచనా వేశారు. తమిళ సినీ చరిత్రలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకోవడం ఖాయమని అనుకున్నారు. కానీ అభిమానులు ఒకటి తలిస్తే ఫలితం మరోలా వచ్చింది. ప్రీమియర్స్ నుంచే డిజాస్టర్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై గట్టిగా పడింది. విజయ్ గత సినిమాలకంటే తక్కువే కలెక్షన్స్‌తో జననాయగన్ దారుణంగా నిరాశపరిచింది.
ఇండియాలో...ఓవర్‌సీస్‌లో...
వరల్డ్ వైడ్‌గా తొలి రోజు వంద కోట్ల మార్క్‌ను కూడా టచ్ చేయలేకపోయింది. ఇండియాతో పాటు ఓవర్‌సీస్ కలిపి గురువారం రోజు జననాయగన్ సినిమాకు 78 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో 48 కోట్ల కలెక్షన్స్ రాగా...ఓవర్‌సీస్‌లో 30 కోట్లను రాబట్టింది.
థియేటర్ రెంటల్స్, టాక్సులు పోను జననాయగన్ మొదటి రోజు 41 కోట్ల షేర్ కలెక్షన్స్‌ను మాత్రమే సొంతం చేసుకోవడం గమనార్హం. విజయ్ కెరీర్‌లో డిజాస్టర్స్‌గా నిలిచిన బీస్ట్ మొదటి రోజు 49 కోట్లు, గోట్ 44 కోట్ల షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నాయి. ఆ రెండు సినిమాల కంటే జననాయగన్ తక్కువ కలెక్షన్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. రెండు రోజు వసూళ్లు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు, హిందీలో డిజాస్టర్....
దళపతి విజయ్‌కి తెలుగు నాట ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉండటంతో స్ట్రెయిట్ సినిమా స్థాయిలో జననాయకుడుకు థియేటర్లు కేటాయించారు. గురువారం రోజు ఐదు షోలను స్క్రీనింగ్ చేశారు. కానీ నెగెటివ్ టాక్ కారణంగా చాలా వరకు థియేటర్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. జననాయకుడు తెలుగు వెర్షన్ అతి కష్టంగా మొదటి రోజు 2.75 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. హిందీ వెర్షన్ కేవలం కోటి డెబ్భై ఐదు లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
ప్రమోషన్స్‌కు దూరం....
సీఎం బాధ్యతల కారణంగా జననాయగన్ ప్రమోషన్స్‌కు విజయ్ దూరంగా ఉన్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో మేకర్స్ ఎలాంటి ఈవెంట్స్, ప్రమోషన్స్ చేయలేదు. అదే తెలుగు వెర్షన్ కలెక్షన్స్ తగ్గడానికి కారణమైంది. దానికి తోడు బాలకృష్ణ భగవంత్ కేసరి రీమేక్‌గా జననాయగన్ తెరకెక్కడంతో ఆడియెన్స్ పెద్దగా థియేటర్లకు రాలేదు.
పొలిటికల్ ఇమేజ్...
భగవంత్ కేసరి మూలకథకు మార్పులు, చేర్పులు చేసి దర్శకుడు హెచ్ వినోథ్ జననాయగన్‌ను తెరకెక్కించారు. అసలు కథను విజయ్ పొలిటికల్ ఇమేజ్ డామినేట్ చేయడంతో జననాయగన్ పూర్తిగా ట్రాక్ తప్పింది. అనవపరసు యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్లతో ఆడియెన్స్‌ను బోర్ కొట్టింది. రన్‌టైమ్ మూడు గంటలు ఉండటం కూడా మైనస్‌గా మారింది. జననాయగన్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. మమితా బైజు కీలక పాత్రలో కనిపించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ సినిమా నుంచి తప్పుకున్న ధృవ్ విక్రమ్ – ఛాంబర్లో కంప్లైంట్
జులై 24, 2026

Naga Durga | ఓటీటీలోకి నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ – ప్రియురాలి కోసం అప్పులపాలైన ప్రేమికుడి కథ
జులై 24, 2026

Pooja Hegde | మూడు గంటల సినిమాలో ముప్పై నిమిషాలు కూడా కనిపించలేదు – పూజా హెగ్డేకు మరోసారి అన్యాయం
జులై 23, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు



