త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | తెలంగాణ ఉద్య‌మంలో ‘పెద్ది’ పాత్ర మ‌రువ‌లేనిది : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Jul 31, 2026, 3.32 pm IST

CM Revanth Reddy | తెలంగాణ ఉద్య‌మంలో ‘పెద్ది’ పాత్ర మ‌రువ‌లేనిది : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి మ‌ర‌ణం తీవ్రంగా క‌లచివేసింది : బీజేపీ చీఫ్

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తీవ్రంగా కలచివేసింది అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి మనోధైర్యం, శక్తిని ప్రసాదించాలని, వారి ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ఆయ‌న తెలిపారు.

Advertisement
Advertisement