త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ ఎలెక్ష‌న్స్ త‌ర్వాతేనా? – హైకోర్టు తీర్పుతో మ‌రోసారి డైల‌మా

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ర‌ద్దు చేసింది. హైకోర్టు తీర్పుతో జ‌న‌నాయ‌గ‌న్ మే వ‌ర‌కు రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

N

Entertainment | Published On Jan 27, 2026, 2.52 pm IST

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ ఎలెక్ష‌న్స్ త‌ర్వాతేనా? – హైకోర్టు తీర్పుతో మ‌రోసారి డైల‌మా
Advertisement

Jana Nayagan | దళపతి విజయ్ మూవీ జన నాయగన్ సెన్సార్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. సినిమాకు మించిన ట్విస్ట్‌ల‌తో సాగుతోంది. మ‌రోసారి ఈ త‌మిళ సినిమాకు హైకోర్టు షాకిచ్చింది. జ‌న‌నాయ‌గ‌న్‌కు యూ /ఏ స‌ర్టిఫికెట్ ఇస్తూ గ‌తంలో సింగిల్ బెచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ర‌ద్దు చేస్తూ మంగళవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దాంతో ఈ వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. సెన్సార్ స‌మ‌స్య మొద‌లై ఇర‌వై రోజులు అవుతున్న ప‌రిష్కారం దొర‌క్క‌పోవ‌డం త‌మిళ‌నాట‌ ఆస‌క్తిక‌ని రేకెత్తిస్తోంది. సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లినా రిలీజ్‌కు మార్గం క్లియ‌ర్ కాక‌పోవ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హైకోర్టు ఏమ‌న్న‌దంటే?

మంగ‌ళ‌వారం జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 6న ఈ త‌మిళ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉండొచ్చ‌ని ఫ్యాన్స్ భావించారు. కానీ హైకోర్టు తీర్పుతో అభిమానుల‌కు మ‌రోసారి నిరాశే మిగిల్చింది. సెన్సార్ బోర్డు వాద‌నలు వినిపించ‌డానికి త‌గినంత స‌మ‌యం ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది.. ఈ సినిమా రిలీజ్‌కు ఉన్న అడ్డంకుల‌కు సంబంధించిన అన్ని అంశాల‌పై మ‌రోసారి విచార‌ణ జ‌రిపి స‌రైన ఆదేశాలు జారీ చేసే అధికారం సింగిల్ బెంచ్‌కు ఉంద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

మే నెల‌లో రిలీజ్‌...

హైకోర్టు తీర్పుతో జ‌న‌నాయ‌గ‌న్‌ రిలీజ్  డైల‌మాలో ప‌డింది. ఇప్ప‌ట్లో జ‌న‌నాయ‌గ‌న్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు. ఈ కేసును మొద‌టి నుంచి విచార‌ణ జ‌ర‌ప‌డానికి క‌నీసం ఇర‌వై రోజులుపైనే స‌మ‌యం ప‌డుతుంది. ఫిబ్ర‌వ‌రిలోనే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ కానుంది. పొలిటిక‌ల్ అంశాల‌తో కూడిన సినిమా కావ‌డంతో ఎలెక్ష‌న్స్ స‌మ‌యంలో రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మే అవుతుంది. దాంతో ఎన్నిక‌లు పూర్త‌య్యి రిజ‌ల్ట్ వ‌చ్చిన త‌ర్వాతే జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ ఉండొచ్చ‌ని అంటున్నారు. అదే జ‌రిగితే మ‌రో మూడు నెల‌ల వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. మే నెలలోనే జననాయగన్ రిలీజ్  కావచ్చునని తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌...

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ సెన్సార్ బోర్డ్ మాత్రం స‌ర్టిఫికెట్ జారీ చేయ‌లేదు. పొలిటిక‌ల్ డైలాగ్స్ విష‌యంలో అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. సాయుధ‌ద‌ళాల‌ను అభ్యంత‌ర‌క‌రంగా చిత్రీక‌రించారంటూ పేర్కొంది. సెన్సార్ జాప్యంపై మేక‌ర్స్ హైకోర్టును ఆశ్ర‌యించారు. సింగిల్ బెంచ్ ఈ మూవీకి యూ/ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పు స‌వాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజ‌న్ బెంచ్‌లో పిటీష‌న్ వేయ‌డంలో రిలీజ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. రిలీజ్ అడ్డంకుల‌ను తొల‌గించాలంటూ మేక‌ర్స్ సుప్రీంకోర్టులో పిటీష‌న్ వేశారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీం తీర్పు చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని అన్న‌ది.
జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ వివాదం సినిమాకు మించిన ట్విస్ట్‌ల‌తో సాగుతోంది. ఈ సినిమాకు యూ ఏ స‌ర్టిఫికెట్ ఇస్తూ

Advertisement

తాజావార్తలు

Advertisement