త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | గెలుపు విజయ్‌ది.. సందడి త్రిషది.. భార్య సంగీత సెలైంట్‌

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మొద‌టిసారే ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ సంచ‌ల‌నం సృష్టించింది. వంద‌కు సీట్ల‌ను సొంతం చేసుకుంది. విజ‌య్ గెలుపు సంబ‌రాల్లో త్రిష పాల్గొన‌గా..అత‌డి భార్య సంగీతం మాత్రం ఎక్క‌డ క‌నిపించ‌లేదు.

N

Entertainment | Published On May 4, 2026, 7.28 pm IST

Thalapathy Vijay | గెలుపు విజయ్‌ది.. సందడి త్రిషది.. భార్య సంగీత సెలైంట్‌
Advertisement

Thalapathy Vijay | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని సాధించి సినిమాల్లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ తానే హీరోనేన‌ని నిరూపించుకున్నారు విజ‌య్‌. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ టీవీకే పార్టీ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. విజ‌య్ కూడా తాను పోటీ చేసిన రెండు చోట్ల గెలిచారు.

విజ‌య్ ఇంటికి త్రిష‌...

విజ‌య్ గెలుపుతో ఆయ‌న ఇంట సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. విజ‌య్ త‌ల్లిదండ్రుల‌తో పాటు అత‌డి బంధువులు, స‌న్నిహితులు ఆనందంలో మునిగిపోయారు. విజ‌య్ ఇంటికి హీరోయిన్ త్రిష కూడా వ‌చ్చింది. అత‌డిని ప్ర‌త్య‌క్షంగా క‌లిసి శుభాకాంక్ష‌లు చెప్పింది. సోమ‌వారం కోలీవుడ్ నుంచి త్రిష మాత్ర‌మే విజ‌య్ నివాసానికి వ‌చ్చి అత‌డిని క‌లిసింది. గ‌త కొద్ది రోజులుగా విజ‌య్‌, త్రిష బంధంపై అనేక రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల న‌డుమ విజ‌య్‌ని, త్రిష క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

డిప్యూటీ సీఎం...

విజ‌య్ పెరంబూరుతో పాటు తిరుచ్చిలో పోటీ చేశారు. రెండు చోట్ల అద్భుత విజ‌యాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఈ రెండింటిలో ఒక స్థానానికి ఆయ‌న రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ప్లేస్‌లో త్రిష‌ను నిల‌బెట్టాల‌ని విజ‌య్ అనుకుంటున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. త్రిష‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వ‌చ్చున‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.మ‌రోవైపు ద‌ళ‌ప‌తి విజ‌య్ గెలుపుపై కోలీవుడ్‌, టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులంద‌రూ రియాక్ట్ అవుతున్నారు. విజ‌య్ విక్ట‌రీని అభినందిస్తున్నారు.

సంగీత మౌనం...

కానీ విజ‌య్ విక్ట‌రీపై అత‌డి భార్య సంగీత మాత్రం సెలైంట్‌గా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్ ఇంట జ‌రిగిన గెలుపు సంబ‌రాల్లో సంగీత‌తో పాటు విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్‌, కూతురు దివ్య క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్‌లు పెట్ట‌లేదు. విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ సంగీత ఇటీవ‌లే కోర్టును ఆశ్ర‌యించింది. వీరి విడాకుల కేసు విచార‌ణ జూన్‌కు వాయిదాప‌డింది. విడాకులు మంజూరు కాలేదు కాబ‌ట్టి విజ‌య్ ఎన్నిక‌ల గెలుపుపై సంగీత రియాక్ట్ అవుతుంద‌ని చాలా మంది నెటిజ‌న్లు భావించారు. కానీ సంగీత మాత్రం మౌనంగా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
మ‌రోవైపు సంగీత నుంచి విడాకులు తీసుకొని త్రిష‌ను విజ‌య్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు కూడా కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement