Thalapathy Vijay Father | కొత్త కారు కొన్న దళపతి విజయ్ తండ్రి – పెళ్లి రోజు గిఫ్ట్
తమిళనాడు సీఎం దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. పెళ్లి రోజు సందర్భంగా భార్య శోభకు బీఎమ్‌డబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు. కొత్త కారుతో చంద్రశేఖర్, శోభ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
Entertainment | Published On Sep 5, 2026, 6.58 pm IST
Thalapathy Vijay Father | తమిళనాడు సీఎం దళపతి విజయ్ తండ్రి కొత్త కారు కొన్నారు. పెళ్లి రోజు సందర్భంగా లగ్జరీ కారును భార్యకు బహుమతిగా ఇచ్చాడు. దళపతి విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభ శనివారం నాడు తమ 52వ పెళ్లి రోజును జరుపుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భార్య శోభకు చంద్రశేఖర్ ఓ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. బీఎమ్‌డబ్ల్యూ 530 ఐ ఎమ్ స్పోర్ట్స్ సెడాన్ మోడల్‌కు చెందిన ఈ కారు ధర కోటి వరకు ఉంటుంది. ఈ కారుతో చంద్రశేఖర్, శోభ దిగిన ఫొటో వైరల్ అవుతోంది.
అగ్ర దర్శకుల్లో ఒకరిగా...
1990 - 2000 దశకంలో కోలీవుడ్‌లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు ఎస్ ఏ చంద్రశేఖర్. దళపతి విజయ్ కోలీవుడ్‌లో అగ్ర హీరోగా పేరుతెచ్చుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. విజయ్‌తో ఇతర దర్శకులు, నిర్మాతలు సినిమాలు చేయకపోవడంతో తామే స్వయంగా కొడుకుతో సినిమాలు నిర్మించారు. కెరీర్ ఆరంభంలో విజయ్ కథానాయకుడిగా నటించిన పలు సినిమాలకు ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తే శోభ కథను అందిస్తూ ఈ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. తండ్రి సినిమాలతోనే విజయ్ స్టార్‌గా మారాడు.
చిరంజీవితో...
ఎస్ ఏ చంద్రశేఖర్ తమిళంలోనే కాకుండా తెలుగులోనూ చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. చిరంజీవి హీరోగా దళపతి విజయ్ తండ్రి దర్శకత్వంలో రూపొందిన చట్టానికి కళ్లులేవు, దేవాంతకుడు, పల్లెటూరి మొనగాడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇవే కాకుండా దోపిడి దొంగలు, ఇంటికో రుద్రమ్మతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలకు ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hero Karthi | ధురంధర్ స్ఫూర్తితో సర్దార్ 2 తెరకెక్కిందా? కంపేరిజన్స్పై హీరో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సెప్టెంబర్ 5, 2026

Kollywood | కత్తితో కేక్ కట్ – స్టార్ డైరెక్టర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై వివాదం
సెప్టెంబర్ 5, 2026

Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజయ్ – రామ్‌చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు – ఫొటోలపై ఓ లుక్కేయండి…
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●KTR | నేతన్న పిలుపుతో సిరిసిల్లకు కేటీఆర్
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ
- ●Hero Karthi | ధురంధర్ స్ఫూర్తితో సర్దార్ 2 తెరకెక్కిందా? కంపేరిజన్స్పై హీరో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?
- ●Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!
- ●Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ

KTR | నేతన్న పిలుపుతో సిరిసిల్లకు కేటీఆర్

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ

Hero Karthi | ధురంధర్ స్ఫూర్తితో సర్దార్ 2 తెరకెక్కిందా? కంపేరిజన్స్పై హీరో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?



