Thalapathy Vijay | ఎన్నికల నామినేషన్‌లో భార్య ఆస్తులు వెల్లడించిన దళపతి విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న దళపతి విజయ్ సోమవారం పెరంబూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో తనతో పాటు తన భార్య సంగీత పేరిట ఉన్న మొత్తం ఆస్తుల వివరాలను వెల్లడించారు.
Entertainment | Published On Mar 30, 2026, 7.57 pm IST
Thalapathy Vijay | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మొత్తం ఆస్తుల లెక్క అఫీషియల్‌గా తేలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న దళపతి విజయ్ తన పేరిట ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను వెల్లడించారు. ఈ నామినేషన్‌లో భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను విజయ్ వెల్లడించారు. భర్త నుంచి విడాకులు కోరుతూ ఇటీవలే సంగీత కోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్‌లోనే విడాకుల కేసు హియరింగ్ ఉంది. విడాకుల ముంగిట నామినేషన్‌లో భార్య పేరుతో పాటు ఆమె ఆస్తుల వివరాలను విజయ్ పేర్కొనడం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కళ్లు చెదిరేలా విజయ్ ఆస్తులు...
ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో విజయ్ భారీగానే ఆస్తులను చూపించారు. తన పేరు మీద 404 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని అన్నారు. భూములు, ఇళ్ల రూపంలో మరో 115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య సంగీత పేరు మీద కూడా 15 కోట్ల వరకు చరాస్తులు ఉన్నట్లు ఈ ఆఫిడవిట్‌లో విజయ్ వెల్లడించారు.
తన భార్య వద్ద మూడు కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు విజయ్ తెలిపారు. అంతే కాకుండా ఆమె వద్ద 135 ఖరీదైన వజ్రాలు ఉన్నట్లు చూపించారు . తన వద్ద కోటి ఇరవై లక్షల విలువైన 883 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు.బిఎండబ్ల్యూ , లెక్సస్ , టయోటా వెల్‌ఫైర్ మరికొన్ని ఖరీదైన కార్లు తాను కొనుగోలు చేసినట్లు ఈ అఫిడవిట్‌లో ఆస్తుల కింద చూపించారు.
రెండు స్థానాల్లో పోటీ...
సొంత పార్టీ టీవీకే తరఫున పెరంబూరుతో పాటు తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుంచి విజయ్ పోటీ చేయబోతున్నారు. మంగళవారం తిరుచిరాపల్లి స్థానానికి సంబంధించిన నామినేషన్స్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. విజయ్ టీవీకే పార్టీ 234 స్థానాల్లో పోటీ చేయబోతున్నది. అభ్యర్థలను ఆదివారం ప్రకటించారు విజయ్.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరుగనున్నాయి. కాగా విడాకుల కేసులో విజయ్ ఏప్రిల్ 20న విజయ్ విచారణకు హాజరు కాబోతున్నారు. హీరోయిన్ త్రిష కారణంగానే విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



