త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | కోలీవుడ్ జననాయగన్…. ఫ్లాప్ సినిమాతో మొద‌లై… రికార్డుల రారాజుగా ఎదిగిన దళపతి విజయ్

34 ఏళ్ల సినీ కెరీర్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ ఎన్నో అవ‌మానాలు, వివాదాల‌ను ఎదుర్కొన్నారు. విజ‌య్ సినీ ప్ర‌యాణం ఫ్లాప్ సినిమాతో మొద‌లైంది. సినిమాల‌కే ప‌నికిరాడంటూ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విజ‌య్ కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగారు.

N

Entertainment | Published On May 4, 2026, 2.51 pm IST

Thalapathy Vijay | కోలీవుడ్ జననాయగన్…. ఫ్లాప్ సినిమాతో మొద‌లై… రికార్డుల రారాజుగా ఎదిగిన దళపతి విజయ్
Advertisement

Thalapathy Vijay |
త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ హ‌వా కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మొద‌టిసారే విజ‌య్ పార్టీ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌బోతుంది. సినిమాల నుంచి సీఎం ప‌ద‌విని అదీష్టించ‌బోతున్న మూడో స్టార్‌గా త‌మిళ‌నాట ద‌ళ‌ప‌తి విజ‌య్ నిల‌వ‌డం ఖాయమ‌ని అంటున్నారు..ఈ గెలుపు వెనుక విజ‌య్ ఎన్నోఏళ్ల శ్ర‌మ దాగి ఉంది. అనేక అవ‌మానాలు, క‌ష్టాలు, వివాదాలు దాటిన విజ‌య్ టాప్ స్టార్‌ నుండి...ఇప్పుడు సీఎంగా మారబోతున్నారు.
విజ‌య్ సినీ కెరీర్ ఫ్లాప్‌తోనే మొద‌లైంది. కొడుకును హీరోగా చూడాల‌ని విజ‌య్ తండ్రి ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్ క‌ల‌లు క‌న్నారు. కానీ అత‌డితో సినిమాలు చేసేందుకు ప్రొడ్యూస‌ర్లు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో తానే స్వ‌యంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌గా మారి న‌ల‌య‌తీర్పు పేరుతో ఓ మూవీని తెర‌కెక్కించారు. కొడుకు సినిమా కోసం త‌న ఆస్తుల‌న్నీ తాక‌ట్టు పెట్టారు చంద్ర‌శేఖ‌ర్‌. ఈ సినిమాకు విజ‌య్ త‌ల్లి శోభా చంద్ర‌శేఖ‌ర్ క‌థ‌ను అందించారు. ఎన్నో క‌ష్టాలు ప‌డి తీసిన ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

అగ్లీ స్టార్....

విజ‌య్ యాక్టింగ్‌, అత‌డి రూపంపై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. అగ్లీ స్టార్ అంటూ ఎగ‌తాళి చేశారు. హీరో మెటీరియ‌ల్ కాద‌ని, యాక్టింగ్ అస్స‌లు రాదంటూ కామెంట్లు చేశారు. ఈ విమ‌ర్శ‌ల‌ను ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు విజ‌య్‌. కెరీర్ ఆరంభంలో తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో ఎక్కువ‌గా సినిమాలు చేశారు విజ‌య్‌. 1994లో వ‌చ్చిన ర‌సిగ‌న్‌తో తొలి విజ‌యాన్ని అందుకున్నారు. దేవా, విష్ణు, ల‌వ్ టుడే, నెరుక్కు నేర్‌తో వ‌రుస‌గా విజ‌యాల‌ను అందుకుంటూ టాప్ హీరోగా మారారు.
34 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 69 సినిమాలు మాత్ర‌మే చేశారు విజ‌య్‌. అందులో విజ‌యాలే ఎక్కువ‌గా ఉన్నాయి. త‌మిళంలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ 20 త‌మిళ సినిమాల్లో విజ‌య్‌వే ప‌ది వ‌ర‌కు ఉంటాయి. లియో మూవీ ఆరు వంద‌ల కోట్ల‌తో రికార్డులు తిర‌గ‌రాసింది.

500 రూపాయ‌ల నుంచి 220 కోట్లు...

హీరో కావ‌డానికంటే ముందు బాల‌న‌టుడిగా తండ్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కొన్ని సినిమాల్లో న‌టించాడు. వెట్రి సినిమాలో చైల్డ్ యాక్ట‌ర్‌గా క‌నిపించిన విజ‌య్ తొలి పారితోషికంగా ఐదు వంద‌ల రూపాయ‌లు అందుకున్నారు. ప్ర‌స్తుతం త‌మిళంలో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ హీరోగా విజ‌య్ రికార్డ్ క్రియేట్ చేశాడు. జ‌న‌నాయ‌గ‌న్ కోసం విజ‌య్ 220 కోట్ల రెమ్యూన‌రేష‌న్ అందుకున్నాడు.

వివాదాలు ఎక్కువే...

ద‌ళ‌ప‌తి విజ‌య్ సినీ కెరీర్‌లో వివాదాలు చాలానే ఉన్నాయి. 2009లో నుంచే పాలిటిక్స్‌పై ఫోక‌స్ పెట్టారు విజ‌య్‌. త‌న రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌ను సినిమాల ద్వారా అభిమానుల‌కు తెలియ‌జేయాల‌ని అనుకున్నారు.  ఆ దిశగానే 2010లో సుర ది లీడ‌ర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా టైటిల్ విష‌యంలో సెన్సార్ పాటు అప్ప‌టి ప్ర‌భుత్వం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. ఆ త‌ర్వాత త‌లైవా విష‌యంలో ఆనాటి అధికార ఏఐఏడీఎంకే పార్టీ నుంచి వ్య‌తిరేక‌త ఎదురైంది. జ‌య‌ల‌లిత‌ను టార్గెట్ చేసి ఈ సినిమా తీశారంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మెర్స‌ల్‌, స‌ర్కార్ సినిమాల్లోనూ బీజేపీ పాల‌న‌ను వ్య‌తిరేకిస్తూ డైలాగ్స్ ఉన్నాయంటూ కేసులు న‌మోదు అయ్యాయి. విజ‌య్ చివ‌రి మూవీ జ‌న‌నాయ‌గ‌న్ కు సెన్సార్ స‌ర్టిఫికేట్ రాలేదు. దాంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా ప‌డింది. సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లిన ఈష్యూ మాత్రం సాల్వ్ కాలేదు.

 

Advertisement
Advertisement