Thalapathy Vijay | సీఎం అవుతానని రెండేళ్ల ముందే దళపతి విజయ్ హింట్ – వైరల్ అవుతోన్న గోట్ మూవీ కారు నంబర్ ప్లేట్
తమిళనాడుకు తాను సీఎం కాబోతున్నట్లు రెండేళ్ల ముందే విజయ్ హింట్ ఇచ్చాడు. 2024లో రిలీజైన గోట్ మూవీలో టీఎన్ సీఎం 2026 అనే నంబర్ ప్లేట్‌తో కూడిన కారును విజయ్ వాడాడు. ఆ సీన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On May 5, 2026, 5.11 pm IST
Thalapathy Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ ఘన విజయాన్ని సాధించి కొత్త చరిత్రను సృష్టించింది. ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారే ఏకంగా 108 స్థానాల్లో జయకేతనాన్ని ఎగరేసింది. అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అధికార డీఎంకేతో పాటు అన్నాడీఎంకే పార్టీలకు షాకిచ్చిన విజయ్ పొలిటికల్ ఎంట్రీలోనే అదరగొట్టారు. తమిళనాడు కొత్త సీఎంగా త్వరలోనే పదవి బాధ్యతలను చేపట్టబోతున్నారు.
రెండేళ్ల ముందే...
2024లో టీవీకే పార్టీని నెలకొల్పిన విజయ్ రెండేళ్ల తర్వాత తాను సీఎం కాబోతున్నట్లు ముందే హింట్ ఇచ్చారు. అది కూడా ఓ సినిమాతో... విజయ్ నటించిన ఆ సినిమాలోని సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయ్ హీరోగా నటించిన గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ) మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్‌లో నటించాడు. గోట్ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ విజయ్ క్రేజ్ కారణంగా కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి.
కారు నంబర్ ప్లేట్...
కాగా ఈ సినిమాలో విజయ్ నడిపే కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'TN 07 CM 2026 అనే నంబర్ ప్లేట్‌తో కూడిన కారును విజయ్ ఈ సినిమాలో వాడాడు. తమిళనాడుకు 2026లో తానే ముఖ్యమంత్రిని అవుతానని ఈ నంబర్ ప్లేట్‌తో రెండేళ్ల ముందే విజయ్ చెప్పాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. ఆ కలను కూడా నిజం చేసుకున్నాడని అంటున్నారు. విజయ్ కారు నంబర్ ప్లేట్ కనిపించే సీన్లను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
రెండు స్థానాల్లో...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో పోటీ చేసిన విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించారు. కాగా తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



