Telugu OTT | ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజైన రెండు తెలుగు సినిమాలు …ఒకటి క్రైమ్ థ్రిల్లర్…మరోటి సైన్స్ ఫిక్షన్
సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో రూపొందిన డ్రీమ్ క్యాచర్‌తో పాటు క్రైమ్ థ్రిల్లర్ మూవీ పైసా వాలా ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వచ్చాయి. ఈ రెండు తెలుగు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Entertainment | Published On May 19, 2026, 8.10 pm IST
Telugu OTT | తెలుగు సినిమాలు డ్రీమ్ క్యాచర్‌తో పాటు పైసావాలా ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో రిలీజయ్యాయి.
సైకలాజికల్ థ్రిల్లర్...
సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన డ్రీమ్ క్యాచర్‌లో ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో నటించారు. సందీప్ కాకుల దర్శకత్వం వహించాడు. రోహన్ శెట్టి మ్యూజిక్ అందించాడు. 2025 జనవరిలో ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
దేవ్ కలలు...
దేవ్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు. రియా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మనస్పర్థల కారణంగా అతడికి రియా బ్రేకప్ చెబుతుంది. అదే టైమ్‌లో దేవ్ తల్లి చనిపోతుంది. దాంతో తాగుడు, డ్రగ్స్‌కు బానిసగా మారిపోతాడు. అప్పటినుంచే దేవ్‌కు కొన్ని భయంకరమైన కలలు రావడం మొదలవుతుంది. కలలో అతడిని ఓ నలుగురు వెంటాడుతుంటారు. కలలో వచ్చిన వ్యక్తులు నిజంగానే దేవ్‌కు తారసపడతారు. వారు ఎవరు? ఆత్మిక అనే అమ్మాయికి దేవ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? దేవ్ కలల సమస్యకు పుల్‌స్టాప్ ఎలా పడింది? అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
పైసా వాలా మూవీ రివ్యూ
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన పైసావాలాకు కొర్రపాటి నవీస్ తేజస్ దర్శకత్వం వహించాడు. బెజ్జంకి అద్విక్, శ్రీధర్, సృజనాక్షిత కీలక పాత్రల్లో కనిపించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కోట్ల రూపాయల హవాలా డబ్బుతో ముడిపడిన ఓ పది రూపాయల నోటు మిస్సవుతుంది. ఆ నోటు కొందరి జీవితాలను ఎలా చిక్కుల్లో పడేసింది? ఓ ఎమ్మెల్యే బామ్మర్ధితో పాటు మరికొందరు ఓ నోటు కోసం ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NTR | ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం దేవుడిచ్చిన వరం.. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్..
మే 20, 2026

Bigg Boss Ayesha | హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Varun Sandesh | నా వైఫ్ మిస్సింగ్ అంటోన్న టాలీవుడ్ హీరో – ఏంటా మిస్టరీ?
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



