త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thriller OTT | నెల రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – క‌ర్మ సిద్ధాంతం క‌థ‌తో….

సుమంత్ హీరోగా న‌టించిన తెలుగు క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ న్యూట‌న్ థ‌ర్డ్ లా వెరైటీ ప్ర‌యోగంగా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఆగ‌స్ట్ 27న ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

N

Entertainment | Published On Aug 16, 2026, 12.33 pm IST

Thriller OTT | నెల రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – క‌ర్మ సిద్ధాంతం క‌థ‌తో….
Advertisement

Thriller OTT |  సుమంత్ హీరోగా న‌టించిన న్యూట‌న్ థ‌ర్డ్ లా మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. క్రైమ్ ఇన్వేస్టిగేట్‌ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, అవ‌స‌రాల శ్రీనివాస్‌, నేహా ప‌ఠాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జూలై నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈటీవీ విన్‌లో...

తాజాగా న్యూట‌ర్ థ‌ర్డ్ లా థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కాక‌ముందే ఓటీటీలోకి రాబోతుంది. ఆగ‌స్ట్ 27 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేర‌కు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

క‌ర్మ సిద్ధాంతం...

వెరైటీ టైటిల్‌తో పాటు సుమంత్‌, జ‌గ‌ప‌తిబాబు లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్లు న‌టించ‌డంతో న్యూట‌న్ థ‌ర్డ్ లాపై రిలీజ్‌కు ముందు అభిమానుల్లో అంచ‌నాలు ఏర్పాడ్డాయి. క‌ర్మ సిద్ధాంతం ఆధారంగా ద‌ర్శ‌కుడు రాజేష్ క‌ర్ణ ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నా థ్రిల్లింగ్‌గా క‌థ‌ను స్క్రీన్‌పై ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోయాడు.

వాసుదేవ్ ఇన్వేస్టిగేష‌న్‌...

జ్యోతి అనే మ‌హిళ యాక్సిడెంట్‌లో చ‌నిపోతుంది. ఇది జ‌రిగిన కొద్ది రోజుల‌కే విన‌య్ అనే అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ఈ రెండు కేసుల‌ను పోలీస్ ఆఫీస‌ర్ వాసుదేవ్ ఇన్వేస్టిగేష‌న్ చేస్తుంటాడు. జ్యోతి యాక్సిడెంట్‌కు విన‌య్‌తో సంబంధం ఉంద‌ని క‌నిపెడ‌తాడు. అప్పుడే మెర్క్యూరీ అనే వ్య‌క్తి గురించి వాసుదేవ్‌కు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది? అదేమిటి? అస‌లు మెర్క్యూరీ ఎవ‌రు? అత‌డిని వాసుదేవ్ ఎలా ప‌ట్టుకున్నాడు అన్న‌దే న్యూట‌న్ థ‌ర్డ్ లా మూవీ క‌థ‌.

మైథాల‌జీ మూవీ...

గ‌త కొన్నేళ్లుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉంటున్న సుమంత్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్నాడు. న్యూట‌న్ థ‌ర్డ్ లా త‌ర్వాత మ‌హేంద్ర‌గిరి వారాణి పేరుతో ఓ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేశాడు. సెప్టెంబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement