త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలో తెలుగులో రిలీజైన క‌న్న‌డ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – హీరోయినే విల‌న్‌గా మారితే!

క‌న్న‌డ సూప‌ర్ హిట్ మూవీ కేస్ ఆఫ్ కొండ‌న తెలుగులో నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాలో విజ‌య్ రాఘ‌వేంద్ర‌, భావ‌న మీన‌న్‌, ఖుషి ర‌వి హీరోహీరోయిన్లుగా న‌టించారు.

N

Entertainment | Published On Jul 23, 2026, 7.25 pm IST

Telugu OTT | ఓటీటీలో తెలుగులో రిలీజైన క‌న్న‌డ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – హీరోయినే విల‌న్‌గా మారితే!
Advertisement

Telugu OTT |  క‌న్న‌డ సూప‌ర్ హిట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ కేస్ ఆఫ్ కొండ‌న తెలుగులోకి వ‌చ్చింది. నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. విజ‌య్ రాఘ‌వేంద్ర‌, భావ‌న మీన‌న్, ఖుషి ర‌వి హీరోహీరోయిన్లుగా న‌టించారు. దేవీ ప్ర‌సాద్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌న్న‌డంలో సూప‌ర్ హిట్‌గా ఈ మూవీ నిలిచింది.

ఒకే రోజులో నాలుగైదు పాత్ర‌ల‌తో...

సీతారామ్ బినోయ్ కేస్ నంబ‌ర్ 18 మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా క‌థ మొత్తం ఒకే రోజులో నాలుగైదు పాత్ర‌ల చుట్టూ సాగుతుంది. ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ద‌ర్శ‌కుడు క‌థ‌ను రాసుకున్న తీరుతో పాటు విజ‌య్ రాఘ‌వేంద్ర‌, భావ‌న యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. గ‌గ‌న్ బ‌దేరియా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

నిజాయితీగా...

విల్స‌న్‌ కొత్త గా పోలీస్ జాబ్‌లో చేరుతాడు. నిజాయితీగా డ్యూటీ చేయాల‌ని క‌ల‌లు కంటాడు. విల్స‌న్ ప‌నిచేస్తోన్న స్టేష‌న్‌లోనే ల‌క్ష్మి పై అధికారిగా ప‌నిచేస్తుంటుంది. విల్స‌న్, ల‌క్ష్మి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోనే వ‌రుస‌గా హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. రాజు ఓ కూలీ. అత‌డి కొడుకు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటాడు. ట్రీట్‌మెంట్ కోసం ఐదు ల‌క్ష‌ల డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. విల్స‌న్ అప్పులు తీర్చ‌డం కోసం త‌న కారును అమ్మేస్తాడు. ఆ డ‌బ్బును విల్స‌న్ ద‌గ్గ‌ర నుంచి రాజు కొట్టేయాల‌ని చూస్తాడు. ఈ క్ర‌మంలో జ‌రిగిన గొడ‌వ‌లో రాజు చ‌నిపోతాడు. ఆ కేసు విల్స‌న్‌పై ప‌డుతుంది. అస‌లు రాజును ఎవ‌రూ హ‌త్య చేశారు? ఈ మ‌ర్డ‌ర్ కేసు నుంచి విల్స‌న్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ప్రాణంగా ప్రేమించిన స‌హానాకు విల్స‌న్ ఎందుకు దూర‌మ‌య్యాడు అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

తెలుగులో....

కేస్ ఆఫ్ కొండ‌న‌లో హీరోయిన్లుగా న‌టించిన ఖుషి ర‌వి, భావ‌న ఇద్ద‌రూ తెలుగులో చాలానే సినిమాలు చేశారు. మ‌ల‌యాళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న భావ‌న తెలుగులో హీరో, ఒంట‌రి, మ‌హ‌త్మ‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ఖుషి ర‌వి తెలుగులో పిండం సినిమా చేసింది.

 

Advertisement
Advertisement