kavitha| KTR వర్జీనియా టూర్.. kavitha రాఖీకి ఈ సారి కూడా దూరం
అన్నా చెల్లెళ్ల అపురూప బంధానికీ ప్రతీకగా జరుపుకునే ఉద్వేగపూరిత పండుగే రక్షా బంధన్. శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పండుగ జరగకపోతే.. అటు రాఖీ కట్టేవారికి..ఇటు కట్టించుకునేవారికి ఆ ఏడాదంతా ఏదో తెలియని వెలితి ఏర్పడుతుంది.
ఈ అనుబంధం కొనసాగేనా: 2025 ఆగస్టులో జైలు నుంచి కవిత విడుదలైనప్పుడు..అన్నయ్య కేటీఆర్ తో భావోద్వేగానికి గురైన దృశ్యం
త్రినేత్ర.న్యూస్ :ఆగస్టు 28నే రాఖీ పౌర్ణమి.
తెలంగాణ రక్షణ సమితి చీఫ్ కవిత (kavitha)...మరి ఈ సారైనా అన్నయ్య KTR కు రాఖీ కడతారా? రాజకీయ వైరుధ్యాలు కొనసాగినా సరే.. కుటుంబ బంధాలను కొనసాగిస్తారా? పండుగ నాడు వెళ్లి కేటీఆర్ (KTR) కు రాఖీ కడతారా? ..ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ..NO. ఈ సారి కూడా ఆమె రాఖీ కట్టరు. ఈయన కట్టించుకోరు..అని తెలుస్తున్నది. ఎందుకంటే....
2024 నుంచి...నో రాఖీ..
ప్రతి ఏటా రాఖీ వేడుకను ఉత్సాహంగా జరుపుకునే కవిత, కేటీఆర్.. ఆ పండుగ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసేవారు. అయితే 2024 నుంచి కవిత రాఖీ కట్టలేదు. ఎందుకంటే.. 2024 మార్చి 15న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టయ్యారు. తిరిగి 5 నెలల తర్వాత 2024 ఆగస్టు 27న బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఆ ఏడాది ఆగస్టు 19న రాఖీ పండుగ జరిగింది. దీంతో కేటీఆర్.. కవితతో అనుబంధాన్ని ఎక్స్ లో షేర్ చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. "జైల్లో ఉన్న కారణంగా ఆమె రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ ఆమె కష్ట సుఖాల్లో వెన్నంటే ఉంటాను" అంటూ ట్వీట్ చేశారు. 2025లో ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి జరిగింది. కానీ అప్పటికే ఆమె కుటుంబానికి దూరమయ్యారు. విభేదాలు పెరిగాయి. అదే రోజు ముఖ్యమైన విషయంలో..కేటీఆర్..ఢిల్లీ పర్యటించారు. దీంతో ఇక వరుసగా రెండో ఏడాది కూడా కవిత రాఖీకి కేటీఆర్ దూరంగా ఉన్నారు

మరి 2026లో ...?
2026లో కూడా రాఖీ కట్టే అవకాశం లేదని తెలుస్తున్నది. కేటీఆర్ ఈ రోజు (ఆగస్టు 16) రాత్రి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. అక్కడి వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ..తన కూతురు అలేఖ్య గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ కోసం 15 రోజులకు పైగా అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 28 న జరిగే రాఖీ పౌర్ణమికి ఆయన అందుబాటులో ఉండడం లేదు. సో...ఈ సారి కూడా కవిత రాఖీ కట్టే పరిస్థితి లేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






