Direct To Cell Service | మొబైల్ టవర్ లేకున్నా వాట్సాప్.. స్టార్‌లింక్‌తో ఎయిర్‌టెల్ కొత్త సేవలు
Direct To Cell Service | మొబైల్ నెట్‌వర్క్ అందని మారుమూల ప్రాంతాల్లోనూ ఇక స్మార్ట్‌ఫోన్‌తో కనెక్టివిటీ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థతో కలిసి భారతీ ఎయిర్‌టెల్ ‘డైరెక్ట్ టు సెల్’ (DTC) శాటిలైట్ కనెక్టివిటీ సేవలను ఆఫ్రికాలో ప్రారంభించింది.
- స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యంలో ‘డైరెక్ట్ టు సెల్’ సేవలు
- ఆఫ్రికాలో సేవలు ప్రారంభించిన ఎయిర్‌టెల్
Direct To Cell Service | మొబైల్ నెట్‌వర్క్ అందని మారుమూల ప్రాంతాల్లోనూ ఇక స్మార్ట్‌ఫోన్‌తో కనెక్టివిటీ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థతో కలిసి భారతీ ఎయిర్‌టెల్ ‘డైరెక్ట్ టు సెల్’ (DTC) శాటిలైట్ కనెక్టివిటీ సేవలను ఆఫ్రికాలో ప్రారంభించింది. ఈ సాంకేతికత ద్వారా ప్రత్యేక శాటిలైట్ ఫోన్, స్టార్‌లింక్ డిష్ అవసరం లేకుండానే అనుకూల స్మార్ట్‌ఫోన్ నేరుగా ఉపగ్రహానికి కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సేవలను ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో అందిస్తున్నారు. అర్హత కలిగిన వినియోగదారులకు తొలి 30 రోజుల పాటు ఈ శాటిలైట్ కనెక్టివిటీని ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
టవర్ లేకున్నా వాట్సాప్
డైరెక్ట్ టు సెల్ సేవలో సంప్రదాయ మొబైల్ టవర్లు, సాధారణ మొబైల్ డేటాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రారంభ దశలో తక్కువ డేటా అవసరమయ్యే వాట్సాప్, ఎస్‌ఎంఎస్ వంటి సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ నెట్‌వర్క్ అందని ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి అత్యవసర సమాచార మార్పిడిలో ఈ సదుపాయం ఉపయోగపడనుంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, మొబైల్ టవర్ల విస్తరణ కష్టంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని ఎయిర్‌టెల్ పేర్కొంది.
ప్రత్యేక పరికరాలు అవసరం లేదు..
ఈ సేవలను ఉపయోగించేందుకు ప్రత్యేక శాటిలైట్ ఫోన్, స్టార్‌లింక్ డిష్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. సేవకు అనుకూలమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. అయితే ఉపగ్రహ సంకేతాలు సులభంగా అందేందుకు ఆకాశం స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ఉండడం మంచిదని కంపెనీ సూచించింది. భవనాల లోపల లేదా ఉపగ్రహ సంకేతాలకు అడ్డంకులు ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
మైఎయిర్‌టెల్ యాప్‌లో రిజిస్ట్రేషన్
ఉచిత సేవను పొందాలనుకునే అర్హత కలిగిన వినియోగదారులు మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ పరికరాల్లో, కంపెనీ నిబంధనలకు లోబడి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. తొలి దశలో 30 రోజులపాటు ఉచితంగా లభించనున్నది. ఈ ఫెసిలిటీ భవిష్యత్తులో సంప్రదాయ నెట్‌వర్క్ అందని ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌కు ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!
- ●Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా
- ●Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..
- ●Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం
- ●Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు

Telangana | రాష్ట్రంలో ఇక వానలు లేనట్టే.. ఎండాకాలాన్ని తలపించేలా అక్టోబర్..!

Congress | కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా

Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..






