Hari Hara Darshanam | ఒకే యాత్రలోల ‘హరి హర దర్శనం’
Hari Hara Darshanam | తిరుపతి సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘హరి హర దర్శనం’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి క్షేత్రాలను ఈ యాత్రలో దర్శనం చేసుకునే వీలు కల్పిస్తోంది.
- ఒకే టూర్ ప్యాకేజీలో నాలుగు క్షేత్రాల సందర్శన
- కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి క్షేత్రాల దర్శనం
Hari Hara Darshanam | తిరుపతి సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘హరి హర దర్శనం’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి క్షేత్రాలను ఈ యాత్రలో దర్శనం చేసుకునే వీలు కల్పిస్తోంది. రైలు ప్రయాణంతో పాటు తిరుపతిలో వసతి, స్థానికంగా ఏసీ రవాణా సౌకర్యాన్ని ప్యాకేజీలో భాగంగా కల్పించనున్నారు.
మూడు రోజుల యాత్ర
లింగంపల్లి నుంచి సాయంత్రం 5.30 గంటలకు 12734 ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్‌కు రైలు 6.10 గంటలకు చేరుకుని.. అక్కడి నుంచి నల్గొండ మీదుగా ప్రయాణం కొనసాగుతుంది. రాత్రి రైల్లోనే ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 5.55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు తరలించి, ఫ్రెష్ అప్ అయ్యాక కాణిపాకం, శ్రీనివాస మంగాపురం క్షేత్రాల సందర్శన ఉంటుంది. అనంతరం తిరిగి తిరుపతికి చేరుకొని రాత్రి బస చేస్తారు. మూడో రోజు ఉదయం అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి శ్రీకాళహస్తికి బయలుదేరుతారు. అక్కడి ఆలయ దర్శనం అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుని రాత్రి 8.20 గంటలకు బయలుదేరే 12733 ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు తెల్లవారుజామున 3.15 గంటలకు నల్గొండ, 5.35 గంటలకు సికింద్రాబాద్, 6.45 గంటలకు లింగంపల్లి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
రెండు రకాల ప్యాకేజీలు..
‘హరి హర దర్శనం’ ప్యాకేజీ కోడ్ SHR083A. స్టాండర్డ్ (స్లీపర్)తో పాటు కంఫర్ట్ (3ఏసీ) కేటగిరీల్లో ప్యాకేజీ అందుబాటులో ఉంది. స్టాండర్డ్ కేటగిరీలో 1 నుంచి 3 మంది కలిసి ట్విన్ షేరింగ్‌పై ఒక్కొక్కరికి రూ.8,520, ట్రిపుల్ షేరింగ్‌పై రూ.6,510గా ధర నిర్ణయించారు. 4 నుంచి 6 మంది గ్రూపులో ఇదే కేటగిరీలో ట్విన్ షేరింగ్ రూ.6,560, ట్రిపుల్ షేరింగ్ రూ.5,590గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.4,440, బెడ్ లేకుండా రూ.3,940గా ఛార్జీ ఉంటుంది. కంఫర్ట్ (3ఏసీ) కేటగిరీలో ట్విన్ షేరింగ్ రూ.10,470, ట్రిపుల్ షేరింగ్ రూ.8,430 ప్యాకేజీ ధరగా నిర్ణయించారు. స్టాండర్డ్ కేటగిరీలో స్లీపర్ క్లాస్, కంఫర్ట్ కేటగిరీలో 3ఏసీ రైలు ప్రయాణం ఉంటుంది. తిరుపతిలో ఏసీ వసతి, స్థానికంగా షేర్డ్ ఏసీ వెహికిల్‌లో రవాణా ఉంటుంది. ఒక రోజు అల్పాహారం, ప్రయాణ బీమా సైతం వర్తిస్తుంది. అయితే, రైలులో ఆహారం, అదనపు భోజనాలు, దర్శన టికెట్లు, మధ్యాహ్నం-రాత్రి భోజనం, టూర్ గైడ్ సేవలు, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో వర్తించవు. అలాగే, దర్శన టికెట్లు సైతం ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ టూరిజం స్పష్టం చేసింది.
సంప్రదించండి ఇలా..
స్టాండర్డ్ కేటగిరీలో స్లీపర్ నాన్-ఏసీలో 20, థర్డ్ఏసీలో ఆరు సీట్ల కోటా ఉన్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు ఆన్‌లైన్ టికెట్లు జారీ అవుతాయి. బెర్త్‌ల కేటాయింపులో ఎలాంటి హామీ ఉండదని, సెంట్రల్ పీఆర్‌ఎస్ ద్వారా కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా రైలు ప్రయాణంతో పాటు ఒకే యాత్రలో పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులు, భక్తుల బృందాలతో తిరుపతి యాత్రకు వెళ్లాలనుకునేవారికి ఇది ఉపయోగపడేలా ఉంది. ఆసక్తి ఉన్న పర్యాటకులు సికింద్రాబాద్‌లోని రైల్వేజోన్ కార్యాలయం, లేదంటే 9701360701 / 9281030712 / 9281030740 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!





