Vimal Elaichi Ad Notice | బాలీవుడ్ స్టార్స్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఝలక్: ‘విమల్’ యాడ్‌పై షారుఖ్, అజయ్, టైగర్‌లకు నోటీసులు
బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పరోక్షంగా పాన్ మసాలాను ప్రమోట్ చేస్తున్నారంటూ నోటీసులు జారీ చేసింది.
Entertainment | Published On Aug 16, 2026, 9.43 am IST
- విమల్ ఇలాచీ (Vimal Elaichi) ప్రకటనలో నటించినందుకు షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర FDA నోటీసులు
- ఇది పరోక్షంగా నిషేధిత పాన్ మసాలాను ప్రమోట్ చేయడమేనని అధికారుల ఆగ్రహం
- 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, సోషల్ మీడియా నుంచి యాడ్‌ను వెంటనే తొలగించాలని ఆదేశం
- నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానా, మూడేళ్ల పాటు ప్రకటనలపై బ్యాన్ పడే అవకాశం
Vimal Elaichi Ad Notice | త్రినేత్ర.న్యూస్ : బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గట్టి షాక్ ఇచ్చింది. నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రమోట్ చేశారనే ఆరోపణలతో ఈ ముగ్గురు స్టార్స్‌కు తాజాగా షోకాజ్ నోటీసులు (show-cause notice) జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
2024లో ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్ 'విమల్' (Vimal) కు చెందిన ఇలాచీ (యాలకులు) ప్రకటనలో ఈ ముగ్గురు హీరోలు కలిసి నటించారు. అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మహారాష్ట్రలో పాన్ మసాలా ఉత్పత్తుల తయారీ, అమ్మకాలపై కఠిన నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం ఇలాచీ పేరుతో పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని FDA చీఫ్ తుకారాం ముండే ఆగస్టు 11న జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. ఇది కచ్చితంగా సర్రోగేట్ అడ్వర్టైజింగ్ (పరోక్షంగా ప్రమోట్ చేయడం) కిందకే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలి
ఈ యాడ్ క్యాంపెయిన్ నుంచి తక్షణమే తప్పుకోవాలని, తమ అఫీషియల్ సోషల్ మీడియా (social media) ఖాతాల నుంచి ఈ యాడ్‌కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని ఆ నోటీసుల్లో అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా, ఈ ప్రకటనకు సంబంధించిన అగ్రిమెంట్స్, బ్రీఫ్స్, పేమెంట్స్ (payments) వివరాలను పూర్తిగా సమర్పించాలని డిమాండ్ చేశారు.
రూ.50 లక్షల వరకు జరిమానా?
వినియోగదారుల రక్షణ చట్టాల (Consumer protection laws) ప్రకారం.. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటిస్తే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భారీ ఫైన్ పడే అవకాశం ఉంది. నేరం తీవ్రతను బట్టి, సదరు సెలబ్రిటీలు రాబోయే మూడేళ్ల పాటు మరే ఇతర ప్రకటనల్లోనూ నటించకుండా బ్యాన్ విధించే అధికారాలు కూడా ఉంటాయి.
గతంలో అక్షయ్ కుమార్ క్షమాపణలు
ఈ విమల్ యాడ్స్ వివాదం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. 2022లో షారుఖ్, అజయ్ దేవగన్‌తో కలిసి 'విమల్ ఇలాచీ' యాడ్‌లో నటించిన స్టార్ హీరో అక్షయ్ కుమార్‌పై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహంతో వెంటనే స్పందించిన ఆయన, పొగాకు సంబంధిత ఉత్పత్తులను ప్రమోట్ చేసినందుకు క్షమాపణలు (apology) చెప్పి ఆ క్యాంపెయిన్ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు, ఆ ప్రకటన ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ను ఒక మంచి సామాజిక కార్యక్రమానికి విరాళంగా ఇస్తానని ప్రకటించి వివాదానికి ముగింపు పలికారు.
— Akshay Kumar (@akshaykumar) April 20, 2022
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!
- ●Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం
- ●NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?
- ●FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!
- ●Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
- ●CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం

Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!

Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం

NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?

FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!






