త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాజాసాబ్ డైరెక్ట‌ర్‌ తెలుగు రొమాంటిక్ మూవీ

తెలుగు మూవీ బ్యూటీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతుంది. జ‌న‌వ‌రి 2 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీలో సీనియ‌ర్ న‌రేష్, వాసుకి, అంకిత్ కొయ్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

N

Entertainment | Published On Dec 30, 2025, 2.59 pm IST

OTT | మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాజాసాబ్ డైరెక్ట‌ర్‌ తెలుగు రొమాంటిక్ మూవీ
Advertisement

OTT |  తెలుగు రొమాంటిక్ మూవీ బ్యూటీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సీనియ‌ర్ న‌రేష్, వాసుకి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీలో అంకిత్ కొయ్య‌, నీల‌ఖీ పాత్ర హీరోహీరోయిన్లుగా న‌టించారు. బ్యూటీ మూవీకి జేఎస్ఎస్ వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిన్న సినిమాకు రాజాసాబ్ డైరెక్ట‌ర్ మారుతి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

మారుతి ప్ర‌జెంట‌ర్‌...

బ్యూటీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. జ‌న‌వ‌రి 2 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను రివీల్ చేసిన జీ5 ఓటీటీ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది.
రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి ఓ సోష‌ల్ మెసేజ్‌ను జోడించి ద‌ర్శ‌కుడు వ‌ర్ధ‌న్ ఈ సినిమాను రూపొందించారు. ప్రేమ పేరుతో నేటి యువ‌త ఎలా మోస‌పోతున్నార‌న్న‌ది ఇందులో చూపించారు. మారుతి ప్ర‌జెంట‌ర్ కావ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో ఈ చిన్న సినిమాపై టాలీవుడ్‌లో మంచి బ‌జ్ ఏర్ప‌డింది.
కానీ కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, అనుకున్న క‌థ‌ను థ్రిల్లింగ్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో బ్యూటీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. తండ్రి పాత్ర‌లో న‌రేష్ యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమాలో డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో అంకిత్ కొయ్య క‌నిపించాడు. ఈ చిన్న సినిమాతోనే నీల‌ఖీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విజ‌య్ బుల్గానిన్ మ్యూజిక్ అందించాడు.

బ్యూటీ క‌థ ఇదే

నారాయ‌ణ (న‌రేష్‌) క్యాబ్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. కూతురు అలేఖ్య (నీల‌ఖి) ప్రాణంగా బ‌తుకుతుంటాడు. అర్జున్ (అంకిత్ కొయ్య‌) అనే యువ‌కుడితో అలేఖ్య ప్రేమ‌లో ప‌డుతుంది. త‌ల్లిదండ్రులు త‌మ ప్రేమ‌కు ఒప్పుకోక‌పోవ‌డంతో ఇంటి నుంచి పారిపోతుంది అలేఖ్య‌. ఆ త‌ర్వాత ఏమైంది? అర్జున్ నిజంగానే అలేఖ్య‌ను ప్రేమించాడా? అమ్మాయిల‌ను లైంకికంగా వేధించే ఓ ముఠా బారి నుంచి త‌న కూతురుని నారాయ‌ణ ఎలా కాపాడుకున్నాడు అన్న‌దే బ్యూటీ మూవీ క‌థ‌.
బ్యూటీ కంటే ముందు తెలుగులో 14 డేస్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో, మారుతి న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు అంకిత్ కొయ్య‌. బ‌చ్చ‌ల‌మ‌ల్లి, ఆయ్‌, స‌త్య‌భామ‌తో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు.

ALSO READ Malayalam OTT | మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – తెలుగులో రిలీజ్‌
Advertisement

తాజావార్తలు

Advertisement