OTT | పది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బాపటేల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ – కాల్ గర్ల్‌తో లాంగ్ డ్రైవ్ వెళితే…
హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ రేపు ఉదయం పది గంటలకు థియేటర్లలో రిలీజైన పది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్యరావు, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో నటించారు.
Entertainment | Published On Mar 27, 2026, 6.54 pm IST
OTT | ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగులో హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది హెబ్బాపటేల్. హిట్టు అందుకొని చాలా ఏళ్లు అయినా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లకు మాత్రం ఢోకాలేదు. హెబ్బాపటేల్ సినిమాలు నెలకు ఒకటి థియేటర్లలోకి వస్తున్నాయి. హెబ్బాపటేల్ కథానాయికగా నటించిన రేపు ఉదయం పది గంటలకు మూవీ మార్చి 14న థియేటర్లలో రిలీజైంది. రెండు వారాలు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్‌లో...
శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రేపు ఉదయం పది గంటలకు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా మేకర్స్ ఈ సినిమాను సడెన్‌గా ఓటీటీలో విడుదలచేశారు.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బాపటేల్‌తో పాటు చైతన్యరావు, అభినవ్ గోమఠం, కిరీటి దామరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. చందు ముద్దు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
డిజాస్టర్...
లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. ఓ సంఘటన కారణంగా ఒక్క రోజులో కొంత మంది వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి గందరగోళం నెలకొందనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది.
ఉదయం పది గంటలకు...
రఘు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఫోన్‌లో పరిచయమైన కాల్ గర్ల్ దివ్య తో లాంగ్ డ్రైవ్‌కు వెళతాడు. మల్లేషం అంబులెన్స్ డ్రైవర్. జీవితంలో ఎప్పటికైనా పైకి రావాలని కలలు కంటుంటాడు. ఓ డ్రగ్ డీలర్ నుంచి పది కోట్లు అనుకోకుండా మిస్సవుతాయి. ఆ మిస్సయిన డబ్బుకు రఘు, దివ్యకు ఉన్న సంబంధమేమిటి? మల్లేషం అంబులెన్స్ ఎక్కిన ప్రేమ జంట ఎవరు? ఉదయం పది గంటలకు వారందరి జీవితాలు ఎలాంటి టర్నింగ్ తీసుకున్నాయి అనే అంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Adah Sharma | పదకొండేళ్ల తర్వాత కన్నడ సినిమాలో అదాశర్మ – బిగ్‌బాస్ విన్నర్‌తో మైథాలజీ మూవీ
సెప్టెంబర్ 21, 2026

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే – రవితేజ బ్లాక్‌బస్టర్‌తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్‌ను మిస్సవ్వొద్దు
సెప్టెంబర్ 18, 2026

Bold OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి తెలుగు అడల్ట్ కామెడీ మూవీ – డబుల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువే!
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు



