త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Comedy OTT | ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైన తెలుగు కామెడీ మూవీ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరో

టాలీవుడ్ క‌మెడియ‌న్లు స‌ప్త‌గిరి, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు మూవీ పురుషః స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీల‌లో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించాడు.

N

Entertainment | Published On Jul 24, 2026, 8.06 pm IST

Comedy OTT  | ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైన తెలుగు కామెడీ మూవీ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరో
Advertisement

Comedy OTT |  తెలుగు కామెడీ మూవీ పురుషః ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలో రిలీజైంది. ఫ‌న్ ఫ్యామిలీ డ్రామాగారూపొందిన ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, స‌ప్త‌గిరి, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి హీరోలుగా న‌టించారు. వీరు వుల‌వ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మే నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం....

పురుషః మూవీలో రాయంచ‌, విషిక‌, హాసిని హీరోయిన్లుగా న‌టించారు. రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ అందించారు. ఈ చిన్న సినిమాకు వెరైటీ ప్ర‌మోష‌న్స్ బాగానే చేశారు. కానీ కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం మైన‌స్‌గా మారింది. ఈ సినిమాతోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

విడాకుల క‌థ‌....

గోవింద్, స‌త్తిబాబు, శ్రీను చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. గోవింద్...క‌మ‌ల‌ను (రాయంచ‌)ను ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. స‌త్తిబాబు, శ్రీనుల‌కు ల‌క్ష్మి, గీత‌తో వివాహం జ‌రుగుతోంది. ఈ ముగ్గురి స్నేహితుల కాపురాలు నిత్యం గొడ‌వ‌ల‌తోనే సాగుతుంటాయి. చివ‌ర‌కు విడాకులు కావాలంటూ క‌మ‌ల‌, ల‌క్ష్మి, గీత కోర్టును ఆశ్ర‌యిస్తారు. ఆ త‌ర్వాత ఏమైంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైన కిస్ ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క థ‌.

టాప్ క‌మెడియ‌న్‌...

స‌ప్త‌గిరి ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ క‌మెడియ‌న్‌గా కొన‌సాగారు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌, వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించారు. రాజావారు రాణిగారు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్‌కుమార్ క‌సిరెడ్డి ల‌క్కీ భాస్క‌ర్‌, గోదారి గ‌ట్టుపైన‌, ఆయ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు.

 

Advertisement
Advertisement