Telugu OTT | మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ – పాతబస్తీ బ్యాక్‌డ్రాప్‌లో…
తెలుగు మూవీ నవాబ్ కేఫ్ రెండు ఓటీటీలలో రిలీజైంది. ఇప్పటికే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీలో శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రల్లో నటించారు.
Entertainment | Published On Mar 26, 2026, 2.49 pm IST
Telugu OTT | లేటెస్ట్ తెలుగు మూవీ నవాబ్ కేఫ్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. నవాబ్ కేఫ్ మూవీలో శివ కందుకూరి, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. తేజు అశ్విని హీరోయిన్‌గా కనిపించింది. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించాడు. పాతబస్తీ ఇరానీ చాయ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన నవాబ్ కేఫ్ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
టైటిల్ ఛేంజ్...
తొలుత ఈ సినిమాకు చాయ్‌వాలా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కానీ సెన్సార్ అభ్యంతరాల కారణంగా రిలీజ్ ముంగిట టైటిల్‌ను నవాబ్ కేఫ్‌గా మార్చారు. టైటిల్ మారడం కూడా సినిమా రిజల్ట్‌పై ఎఫెక్ట్ చూపించింది.
నవాబ్ కేఫ్ మూవీలో రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందించాడు.
తండ్రీకొడుకుల ఘర్షణ...
రంగనాథ్ (రాజీవ్ కనకాల) హైదరాబాద్‌లోని పాతబస్తీలో నవాబ్ కేఫ్‌ను రన్ చేస్తుంటాడు. తండ్రి నుంచి వారసత్వంగా రంగనాథ్‌కు ఆ కేఫ్ వస్తుంది. తమ కుటుంబానికి జీవనాధారమైన ఆ కేఫ్ అంటే రంగనాథ్‌కు ప్రాణం. రంగనాథ్ కొడుకు రాజా (శివ కందుకూరి)మాత్రం కేఫ్‌లో పనిచేయడానికి ఇష్టపడతాడు. ఆ కేఫ్ అమ్మేసి అమెరికా వెళ్లిపోవాలని అనుకుంటాడు. కేఫ్ అమ్మకం విషయంలో తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. అనుకోకుండా రంగనాథ్ చనిపోతాడు. తండ్రి మరణం రాజాలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? నవాబ్ కేఫ్‌ను అమ్మేశాడా? తండ్రికి ఇచ్చిన మాట కోసం దానిని నడిపించాడా? రాజాకు అండగా నిలిచిన సఖీ (తేజు అశ్విని) ఎవరు? నవాబ్ కేఫ్ దక్కించుకోవాలని ప్రయత్నించిన కుమార్‌కు రంగనాథ్‌కు ఉన్న సంబంధమేమిటి అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
మే 14, 2026

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026

Rahul Ramakrishna | భ్రమల నుంచి బయటకు రాకపోతే …ఖాళీ థియేటర్లే గతి – రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
మే 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



