త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Champion OTT | ఓటీటీలోకి తెలుగు పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ – స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఇవే!

రోష‌న్, అన‌స్వ‌ర రాజ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన తెలుగు మూవీ ఛాంపియ‌న్ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. జ‌న‌వ‌రి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ తెలుగు పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 18, 2026, 2.45 pm IST

Champion OTT | ఓటీటీలోకి తెలుగు పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ – స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఇవే!
Advertisement

Champion OTT |  సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ మేక హీరోగా న‌టించిన ఛాంపియ‌న్ (Champion) మూవీ ఓటీటీ (OTT) రిలీజ్ డేట్ ఖ‌రారైంది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన‌శ్వ‌ర రాజ‌న్ హీరోయిన్‌గా న‌టించింది.
థియేట‌ర్ల‌లో మంచి సినిమాగా ఆడియెన్స్ మ‌న్న‌న‌ల‌ను అందుకున్న ఛాంపియ‌న్ తాజాగా ఓటీటీలోకి వ‌స్తోంది. జ‌న‌వ‌రి 23న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెల‌రోజుల్లోపే...

డిసెంబ‌ర్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఛాంపియ‌న్ నెల రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే ఓటీటీలో విడుద‌ల కాబోతుంది. దాదాపు న‌ల‌భై ఐదు కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ప్రియాంక‌ద‌త్‌, జెమిని కిర‌ణ్ ఈ సినిమాను నిర్మించారు. కాన్సెప్ట్‌, టెక్నిక‌ల్‌గా సినిమా బాగుంద‌ని టాక్ వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం లాభాల‌ను నిర్మాత‌లు ఛాంపియ‌న్ లాభాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయింది.

నంద‌మూరి హీరో...

ఛాంపియ‌న్ మూవీలో సీనియ‌ర్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి కీల‌క పాత్ర‌లో న‌టించాడు. దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి. సంతోష్ ప్ర‌తాప్‌, కేకే మీన‌న్‌, ప్ర‌కాష్ రాజ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు. మ‌ల‌యాళం హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ గెస్ట్ రోల్ చేశాడు.

భైరాన్‌ప‌ల్లి ఘ‌ట‌న‌తో...

తెలంగాణ సాయుధ‌పోరాటంలోని భైరాన్ ప‌ల్లి ఘ‌ట‌న‌కు ఫిక్ష‌న‌ల్ ఎలిమెంట్స్ జోడించి ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ అద్వైతం ఛాంపియ‌న్ మూవీని తెర‌కెక్కించారు. మైఖేల్ (రోష‌న్‌) ఓ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. ఇంగ్లండ్ వెళ్లి సెటిలైపోవాల‌ని క‌ల‌లు కంటాడు. మైఖేల్ తండ్రిపై దేశ‌ద్రోహి అనే ముద్ర ఉండ‌టం అత‌డి క‌ల‌కు అడ్డంకిగా మారుతోంది. ఇంగ్లండ్ వెళ్ల‌డం కోసం హైద‌రాబాద్ నుంచి బీద‌ర్‌కు అక్ర‌మంగా ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు మైఖేల్‌. అనుకోకుండా పోలీసుల‌కు దొరికిపోయి భైరాన్‌ప‌ల్లిలో త‌ల‌దాచుకోవాల్సివ‌స్తుంది. ఆ ఊరిలో అడుగుపెట్టిన త‌ర్వాత మైఖేల్ జీవితం ఎలా మారిపోయింది? నిజాంతో పాటు దేశ్‌ముఖ్ సైన్యాన్ని ఎదురించి భైరాన్ పల్లి కోసం మైఖేల్ ఎలాంటి పోరాటం సాగించాడ‌నే అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

Advertisement

తాజావార్తలు

Advertisement