త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఒకే రోజు ఆరు ఓటీటీల‌లో రిలీజైన తెలుగు హార‌ర్ మూవీ – యోగ‌పురం మిస్ట‌రీతో…

తెలుగు హార‌ర్ మూవీ మారీచ ఒకే రోజు ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజైంది. ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, స‌న్‌నెక్స్ట్‌తో పాటు మ‌రో మూడు ఓటీటీల‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది.

N

Entertainment | Published On Apr 5, 2026, 4.58 pm IST

OTT  | ఒకే రోజు ఆరు ఓటీటీల‌లో రిలీజైన తెలుగు హార‌ర్ మూవీ – యోగ‌పురం మిస్ట‌రీతో…
Advertisement

OTT | తెలుగు మిస్టిక‌ల్ హార‌ర్ మూవీ మారీచ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఒకే రోజు ఆరు ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, స‌న్ నెక్స్ట్ తో పాటు హంగామా ఓటీటీ, వాచో, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌, హంగామా ప్లే ఓటీటీల‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ధ‌ర్మానికి...అధ‌ర్మానికి

మారీచ మూవీలో అతాన్ సంతోష్‌, అజామ్‌, స‌య్య‌ద్ గౌస్‌, కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శివాజీ, సురేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ఘంట‌సాల విశ్వ‌నాథ్ సంగీతం అందించారు.
ధ‌ర్మానికి, అధ‌ర్మానికి మ‌ధ్య జ‌రిగిన యుద్ధం నేప‌థ్యంలో ద‌ర్శ‌క‌ద్వ‌యం మారీచ సినిమాను రూపొందించారు. యోగ‌పురాన్ని ఓ దుష్ట‌శ‌క్తి పీడిస్తుంటుంది. ఆ దుష్ట‌శ‌క్తి కార‌ణంగా ఊరిలోఅనూహ్య సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి. ఆ శ‌క్తిని ఎదురించ‌డానికి ప్ర‌య‌త్నించిన వాళ్లు చ‌నిపోతుంటారు. శివుడి అండ‌గా ఓ యువ‌కుడు ఆ దుష్ట‌శ‌క్తిపై ఎలాంటి పోరాటం సాగించాడు అనే అంశాల‌తో మారీచ మూవీ రూపొందింది. నూత‌న న‌టీన‌టుల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్‌లో మేక‌ర్స్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో పురాణాల‌ను ట‌చ్ చేశారు. హీరోతో పాటు డైరెక్ట‌ర్లు శివాజీ, సురేష్‌ల‌కు ఇదే మొద‌టి సినిమా.ఈ వారం మారీచ‌తో పాటు శ్రీవిష్ణు మృత్యుంజ‌య్‌, సాంప్ర‌దాయిని సుస్పిని సుద్ద‌పూస‌నితో పాటు ప‌లు సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చాయి.

Advertisement
Advertisement