Telugu OTT | ఓటీటీలోకి మెగా డాటర్ బ్లాక్‌బస్టర్ తెలుగు హారర్ కామెడీ మూవీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రాకాసస్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యాయి.
Entertainment | Published On Apr 26, 2026, 10.50 am IST
Telugu OTT | హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయిన మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌గా మాత్రం అదరగొడుతోంది. రాకస మూవీతో నిర్మాతగా సెకండ్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఫాంటసీ హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. గెటప్ శీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. రాకస మూవీతో మానస శర్మ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రాకాస ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యాయి. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రాకస విడుదల కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
27 కోట్ల కలెక్షన్స్...
పదిహేను కోట్ల బడ్జెట్‌తో నిహారిక కొణిదెల నిర్మించిన ఈ మూవీ 27 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. మెగా డాటర్‌కు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. కాన్సెప్ట్‌తో పాటు కామెడీ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. రాకాస మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో ఓ సాంగ్‌లో నిహారిక కొణిదెల తళుక్కున మెరిసింది.
రాకవరం మిస్టరీ...
రాకవరం ఊరి పొలిమేరలో ఉన్న కోటలో ఓ రాక్షసుడు ఉంటాడు. అతడికి నరబలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంటుంది. అదే ఊరికి చెందిన వీర (సంగీత్ శోభన్) తాను ప్రేమించిన అమ్మాయి కోసం రాకవరం వస్తాడు. కానీ ఆ అమ్మాయి వీరను మోసం చేస్తుంది. ఆ బాధలో ఉండగానే కోటలోని రాక్షసుడికి బలి కోసం వీర స్నేహితుడు బాలరాజు పేరును ఊరు ప్రజలు ఖరారు చేస్తారు. బాలరాజు బదులు వీర కోట లోపలికి వెళతాడు. అలా ఎందుకు జరిగింది? ఆ కోటలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడా? వీరను ప్రేమించిన సుబ్బలక్ష్మి...బాలరాజుతో కలిసి కోటలోకి ఎలా వచ్చింది? కోటలో ఉన్న సోము ఎవరు? రాక్షసుడిని చంపితేనే కోట నుంచి విముక్తి లభిస్తుందని తెలిసి వీర ఏం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



