త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Heroines | కోలీవుడ్‌లో అచ్చ‌ తెలుగు అమ్మాయిల జోరు … హీరోయిన్లుగా అద‌ర‌గొడుతోన్న‌ టాలీవుడ్ బ్యూటీలు!

కోలీవుడ్‌లో అచ్చ తెలుగు హీరోయిన్ల హ‌వా కొన‌సాగుతోంది. న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌ల‌తో క‌థానాయిక‌లుగా త‌మిళ ప్రేక్ష‌కుల మనసులను గెలచుకుంటున్నారు తెలుగు ముద్దుగుమ్మలు. కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా మారిపోయిన ప‌ద‌హార‌ణాల తెలుగు అమ్మాయిలు ఎవ‌రంటే?

N

Entertainment | Published On Mar 31, 2026, 2.28 pm IST

Telugu Heroines |  కోలీవుడ్‌లో అచ్చ‌ తెలుగు అమ్మాయిల జోరు … హీరోయిన్లుగా అద‌ర‌గొడుతోన్న‌ టాలీవుడ్ బ్యూటీలు!
Advertisement

Telugu Heroines |  ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని అంటుంటారు. కానీ ఈ నానుడిని అచ్చ తెలుగు హీరోయిన్లు తిర‌గ‌రాస్తున్నారు. టాలీవుడ్‌లో అవ‌కాశాల ప‌రంగా వివ‌క్ష ఎదుర్కొంటున్న తెలుగు అమ్మాయిలు కోలీవుడ్‌లో మాత్రం విజ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్నారు. త‌మిళంలో వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. త‌మిళంలో స‌త్తా చాటుతోన్న అచ్చ తెలుగు హీరోయిన్లు ఎవ‌రంటే?

శ్రీ గౌరీప్రియ‌...

అంద‌రూ న‌న్ను త‌మిళఅమ్మాయి అని పొర‌ప‌డుతున్నారు. కానీ నేను అచ్చ తెలుగు అమ్మాయినే అంటూ ఇటీవ‌ల జ‌రిగిన కోలీవుడ్‌ మూవీ హ్యాపీరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీ గౌరీప్రియ చెప్పిన మాట‌లివి. కాకినాడ‌లో పుట్టి హైద‌రాబాద్‌లో పెరిగిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ అచ్చ తెలుగు బ్యూటీ ల‌వ్‌స్టోరీ, శ్రీకారంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసింది.మ్యాడ్ మూవీతో తెలుగులో ఫ‌స్ట్ హిట్‌ను అందుకుంది. అయితే తెలుగులో కంటే త‌మిళంలోనే ఎక్కువ‌గా అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది . కోలీవుడ్‌లో శ్రీగౌరిప్రియ హీరోయిన్‌గా న‌టించిన ల‌వ‌ర్‌తో పాటు ఇటీవ‌ల రిలీజైన హ్యాపీరాజ్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. త‌మిళంలో మోడ్ర‌న్ ల‌వ్ ఇన్ చెన్నై వెబ్‌సిరీస్‌లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం కోలీవుడ్ హీరో జ‌యంర‌వితో బ్రోకోడ్ అనే సినిమా చేస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో శ్రీగౌరీప్రియ హీరోయిన్‌గా న‌టించిన చెన్నై ల‌వ్‌స్టోరీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తోంది.

సాన్వీ మేఘ‌న‌...

తెలుగు సినిమాల‌తో కెరీర్‌ను ప్రారంభించి త‌మిళంలో సెటిలైపోయింది హైద‌రాబాదీ బ్యూటీ సాన్వీ మేఘ‌న‌. ఈ అమ్మ‌డు హీరోయిన్‌గా గ‌త ఏడాది రిలీజైన త‌మిళ మూవీ కుడుంబ‌స్తాన్ సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. ఈ విజ‌యంతో సాన్వీ మేఘ‌న‌కు కోలీవుడ్‌లో ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవాతో మూన్‌వాక్ సినిమా చేస్తోంది. ప్రేమిస్తే భ‌ర‌త్‌తో ఓ సినిమా అంగీక‌రించింది. . తెలుగులో పిట్ట‌క‌థ‌లు, పుష్ప‌క‌విమానంతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. సంక్రాంతికి రిలీజైన అన‌గ‌న‌గా ఒక రాజులో స్పెష‌ల్ సాంగ్‌లో త‌ళుక్కున మెరిసింది.

తండ్రి బాటలో...

దొర‌సాని మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హీరో రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌ల ముద్దుల త‌న‌య శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌. తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో నాచుర‌ల్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకుంది. తొలి సినిమాతో మంచి పేరొచ్చిన తెలుగులో అవ‌కాశాలు మ‌త్రం రాలేదు. కానీ త‌మిళంలో మాత్రం బిజీగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు త‌మిళ సినిమాలు చేసింది. గ‌త ఏడాది కోలీవుడ్‌లో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన బాంబ్‌తో పాటు ఆరోమాళే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాయి. శివాత్మిక సోద‌రి శివానీ కూడా త‌మిళంలో కొన్ని సినిమాలు చేసింది.

బేబీ హీరోయిన్‌....

బేబీ బ్యూటీ వైష్ణ‌వి చైత‌న్య ప్ర‌స్తుతం త‌మిళంలో ఓ రెండు సినిమాలు చేస్తోంది. ఓ ల‌వ్‌స్టోరీలో త‌మిళ హీరో ఆర్య‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. ఇటీవ‌ల రిలీజైన క‌పుల్ ఫ్రెండ్లీ మూవీతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి. ఈ చిన్న సినిమా మంచి వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ ఏడాదే మాన‌స వార‌ణాసి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది...

తమిళ సినిమాలతోనే ఫేమస్...

సాధార‌ణంగా హీరోయిన్లు మాతృభాష‌లో కెరీర్‌ను మొద‌లుపెట్టి ప‌ర‌భాష‌లోకి అడుగుపడుతుంటారు. కానీ తెలుగ‌మ్మాయి అంజ‌లి కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. త‌మిళ సినిమాల‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అంజ‌లి ఆ త‌ర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌మిళంలో అంజ‌లి న‌టించిన ప‌లు సినిమాలు అవార్డుల‌తో పాటు రివార్డులు అందుకున్నాయి. ఎన్నో సినిమాల్లో డీ గ్లామ‌ర్ రోల్స్‌తో కోలీవుడ్ ఆడియెన్స్‌ను మెప్పించింది. ప్ర‌స్తుతం త‌మిళంలో మూడు సినిమాలు చేస్తోంది.
త‌మిళ‌కుట్టిగా కోలీవుడ్ సినీ అభిమానుల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసిన శ్రీదివ్య పుట్టి పెరిగింది హైద‌రాబాద్‌లోనే. మేయ్య‌జ‌మీగ‌న్‌, కాష్మారా, రెమోతో పాటు శ్రీదివ్య హీరోయిన్‌గా న‌టించిన ప‌లు త‌మిళ సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. వ‌రంగ‌ల్ అమ్మాయి ఆనంది త‌మిళంలో న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిస్తోంది. త‌మిళ మూవీ క‌య‌ల్‌నే త‌న ఇంటి పేరుగా మార్చుకుంది. వీరే కాకుండా మ‌రికొంద‌రు తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ సిల్వ‌ర్‌స్క్రీన్‌పై అద‌ర‌గొడుతోన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement