Tollywood | డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు – ప్రెసిడెంట్‌గా వీఎన్ ఆదిత్య విజయం…ట్రెజరర్‌గా బేబీ డైరెక్టర్
తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ఎంపవర్ ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది. వైస్ ప్రెసిడెంట్‌గా సముద్ర, ట్రెజరర్‌గా సాయిరాజేష్ గెలుపొందారు.
Entertainment | Published On Mar 8, 2026, 6.36 pm IST
Tollywood | టాలీవుడ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ఎంపవర్ ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది. ఈ సారి దర్శకుల సంఘం ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య, వీరశంకర్‌తో పాటు మద్దినేని రమేష్ ప్యానల్స్ పోటీ చేశాయి. ఆదివారం సారథి స్టూడియోలో జరిగిన ఈ ఎన్నికల్లో పలువురు దర్శకులు తమ ఓటు హక్కును వినయోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ప్యానల్ ఎక్కువ ఓట్టు పడ్డాయి.
ప్రెసిడెంట్‌గా...
ఈ ప్యానల్ నుండి ప్రెసిడెంట్‌గా వీఎన్ ఆదిత్య, వైస్ ప్రెసిడెంట్‌గా సముద్ర, సెక్రటరీగా సాయిరాజేష్ గెలుపొందారు. ఎంపవర్ ప్యానల్ 18 స్థానాలకు గాను పదహారింటిలో విజయాన్ని సాధించింది. వీఎన్ ఆదిత్య ప్యానల్ నుంచి ఎస్వీ భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్, చెరుకూరి బాలాజీ, వంశీకృష్ణ దొండపాటితో పాటు శ్రీరామ్ ఆదిత్య, సాగర్ చంద్ర, నవీన్ మేడారం పోటీ చేశారు.
వీరశంకర్ ప్రొగ్రెసివ్ ప్యానల్ నుంచి సీహెచ్ సుబ్బారెడ్డి, వడ్డాణం రమేష్, రాజా వన్నెంరెడ్డి, కొండా విజయ్‌కుమార్‌తో పాటు పలువురు బరిలో నిలిచారు.
మద్దినేని అండ్ కస్తూరి ప్యానల్ నుంచి మద్దినేని రమేష్, కస్తూరి శ్రీనివాస్, సీ శ్రీనివాస్‌తో పాటు పలువురు పోటీలో నిలిచారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వీఎన్ ఆదిత్య రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
జూనియర్ ఆర్టిస్ట్ ఎలక్షన్స్
ఆదివారం దర్శకుల సంఘంతో పాటు తెలుగు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు కూడా ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ ప్యానల్ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 4000 వేల ఓట్లు ఉండగా...1390 ఓట్ల మెజారిటీతో ప్రెసిడెంట్‌గా వల్లభనేని అనిల్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



