Telugu Web Series | ఉదయభాను తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ – ప్రసాదరావు డాటర్ ఎలా మిస్సయ్యింది?
యాంకర్ ఉదయభాను ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో ఉదయభాను పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతుంది.
Entertainment | Published On Feb 19, 2026, 2.33 pm IST
Telugu Web Series | క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది యాంకర్ ఉదయభాను. డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు టైటిల్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. ఈ తెలుగు వెబ్ సిరీస్‌లో ఉదయభానుతో పాటు రాజీవ్ కనకాల, వసంతిక, శ్రీరామ్ వెంకట్ కీలక పాత్రలు పోషించారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. డాటర్ ఆఫ్ ప్రసాదరావు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు క్రైమ్ ఇన్వేస్టిగేట్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఏం మిస్ అవుతున్నాను...
‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా’ అనే డైలాగ్‌తో డాటర్ ఆఫ్ ప్రసాదరావు ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ను చూపించారు. ‘నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా?’.. ‘ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టాలి’ అంటూ సాగే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత క్రైమ్ ఎలిమెంట్స్‌లోకి ట్రైలర్ షిప్టయ్యింది. కూతురు మిస్ అవ్వడం, తండ్రి కంప్లైంట్‌తో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే సీన్లు ఉత్కంఠను పంచాయి. కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను అంటూ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఉదయ భాను చెప్పిన డైలాగ్స్‌తో సిరీస్‌లో చాలానే ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంట్రెస్టింగ్‌గా...
ఇక స్వాతి అనే అమ్మాయి ఎలా మిస్ అయింది? ఆమె అదృశ్యం వెనుక ఎవరు ఉన్నారు? ఎవరు? హాస్టల్‌లోని స్నేహితులు కారణమా? ఆఫీసులో గొడవలా? ఈ కేసులో తండ్రి పాత్ర ఏంటి? అనే పలు రకాల ప్రశ్నల్ని లేవనెత్తేలా డ్రాటర్ ఆఫ్ ప్రసాదరావు ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
పోలీస్ ఆఫీసర్‌గా...
ఈ వెబ్ సిరీస్‌లో రెబెకా జోసెఫ్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉదయభాను కనిపించబోతుంది. కెరీర్‌లో ఇప్పటివరకు కనిపించనటువంటి సరికొత్త క్యారెక్టర్‌ను ఇందులో చేస్తోంది. తండ్రిగా ఎమోషనల్ రోల్‌లో రాజీవ్ కనకాల కనిపించబోతున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆయన క్యారెక్టర్‌లో మరో యాంగిల్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
కృష్ణ పోలూరు దర్శకత్వం వహిస్తున్న మూడో తెలుగు వెబ్ సిరీస్ ఇది. గతంలో రెక్కీ, విరాటపాలెం సిరీస్‌లను రూపొందించారు. ఈ సిరీస్‌ను కేవీ శ్రీరామ్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌కు శ్రీరామ్ మద్దూరి మ్యూజిక్ అందించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Web Series | సలార్ రాజు మిస్సింగ్ – మెగా బ్రదర్ రీఎంట్రీ .. కామెడీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
మే 14, 2026

Jananayagan OTT | జననాయగన్ ఓటీటీ డీల్…. అప్పుడు 120 కోట్లు – ఇప్పుడు 50 కోట్లు – లీక్ ఎఫెక్ట్
మే 2, 2026

Kerala Story 2 OTT | ఓటీటీలోకి వివాదాస్పద మూవీ కేరళ స్టోరీ 2 – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?
ఏప్రిల్ 24, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



