Crime Comedy OTT | ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ – దృశ్యం సినిమాకు మించిన ట్విస్ట్‌లతో…
శివాజీ హీరోగా నటించిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On Mar 30, 2026, 3.57 pm IST
Crime Comedy OTT | సీనియర్ హీరో శివాజీ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను నిర్మించారు. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీతో పాటు లయ, రోహన్ కీలక పాత్రల్లో నటించారు. ఈటీవీ విన్ ఓటీటీతో కలిసి శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను నిర్మించారు. మార్చి ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఈటీవీ విన్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో...
తాజాగా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫామ్ రివీలయ్యాయి. ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈటీవీ విన్ ఓటీటీ నిర్మించిన ఈ క్రైమ్ కామెడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
అనిల్ రావిపూడి సలహా...
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను ఓటీటీ కోసమే నిర్మించారు. రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్‌చేశారు. కానీ అనిల్ రావిపూడి సలహాతో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకొని థియేటర్లలో రిలీజ్ చేశారు. ట్రైలర్, టీజర్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాను అనుకున్న కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడనే విమర్శలు వచ్చాయి.
శ్రీరామ్ కష్టాలు...
శ్రీరామ్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంటాడు. నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకుంటాడు. భార్య ఉత్తర (లయ)తో పాటు కొడుకు బిట్టు (రోహన్) లది మాత్రం శ్రీరామ్‌కు భిన్నమైన మనస్తత్వం. ఎస్ఐ విక్రమ్ వాసుదేవ్‌తో (ప్రిన్స్) శ్రీరామ్‌కు గొడవలు ఉంటాయి. అనుకోకుండా శ్రీరామ్ ఇంట్లోనే అతడి కొడుకు బిట్టు చేతిలో ఎస్ఐ విక్రమ్ చనిపోతాడు. ఆ డెడ్‌బాడీని ముగ్గురు కలిసి మాయం చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? లోకల్ ఎమ్మెల్యే తిమ్మప్ప దగ్గర నుంచి మిస్సయిన కోటి రూపాయల బ్యాగ్ శ్రీరామ్ దగ్గరకు ఎలా చేరింది? ఎస్ఐ విక్రమ్ హత్య వెనకున్న అసలు ట్విస్ట్ ఎలా బయటపడింది అన్నదే ఈ మూవీ కథ. గతంలో శివాజీ, లయ కాంబినేషన్‌లో మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రంతో పాటు మరో మూడు సినిమాలు వచ్చాయి.
సంబంధిత వార్తలు

Comedy OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – హీరోగా బిగ్‌బాస్ కంటెస్టెంట్
మే 21, 2026

Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
మే 14, 2026

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



