Telugu OTT | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ – అర్జున్ రెడ్డి లాంటి లవ్‌స్టోరీ
తెలుగు రొమాంటిక్ మూవీ నిలవే ఓటీటీలోకి రాబోతుంది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Apr 7, 2026, 8.06 pm IST
Telugu OTT | లేటెస్ట్ తెలుగు మూవీ నిలవే ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నిలవే మూవీకి సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం దర్శకత్వం వహించారు. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. నిలవే మూవీ ఏప్రిల్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది.
అర్జున్ రెడ్డితో కంపేరిజన్స్...
నిలవే మూవీ ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. విడుదలకు ముందు ఈ సినిమాను అర్జున్ రెడ్డితో కంపేర్ చేశారు. హీరో క్యారెక్టరైజేషన్‌తో పాటు బోల్డ్, రొమాంటిక్ సీన్లు అర్జున్ రెడ్డిని గుర్తుచేస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. కానీ ఈ పోలికలు సినిమా విజయానికి ఉపయోగపడలేదు.
అర్జున్...అతిథి ప్రేమకథ...
తనకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలని కోరుకునే అబ్బాయి.. బంధాలు, బంధుత్వాలకు దూరంగా ఒంటరిగా బతకాలని కలలు కనే అమ్మాయి మధ్య ప్రేమకథతో దర్శకద్వయం ఈ సినిమాను తెరకెక్కించారు.
అర్జున్ ఓ యాడ్ ఎజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. ప్రేమలో పడటమే లక్ష్యంగా బతుకుతుంటాడు. కానీ ఏ అమ్మాయి అర్జున్‌ను ఇష్టపడదు. ప్రపోజ్ చేసిన అమ్మాయిలందరూ అర్జున్‌ను రిజెక్ట్ చేస్తుంటారు. ఈ డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అదే టైమ్‌లో అతడి జీవితంలోకి అతిథి వస్తుంది. తొలి చూపులతోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అతిథి కూడా అర్జున్‌ను ఇష్టపడుతుంది. అర్జున్‌తో ప్రేమకు ఓకే చెప్పిన అతిథి పెళ్లికి మాత్రం నో అంటుంది. అందుకు కారణమేమిటి? అతిథి ఫ్లాష్‌బ్యాక్ లో ఏం జరిగింది? అన్నదే ఈ మూవీ కథ.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






