Naga Bandham OTT |ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి నభా నటేష్ తెలుగు మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ
తెలుగు అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ నాగబంధం ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విరాట్ కర్ణ హీరోగా నటించిన ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించారు.
Entertainment | Published On Jul 23, 2026, 8.39 pm IST
తెలుగు మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ నాగబంధం థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. విరాట్ కర్ణ హీరోగా నటించిన ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించారు. అనసూయ, జగపతిబాబు, రామచంద్రరాజు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించాడు.
మైథలాజికల్ మూవీ...
ఈ మైథలాజికల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదల అవుతోంది.
నిర్మాణ దశ నుంచే...
బడ్జెట్, లోకేషన్స్ కారణంగా నిర్మాణ దశ నుంచే తెలుగు ఆడియెన్స్‌లో నాగబంధం ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నా థ్రిల్లింగ్‌గా చెప్పడంలో డైరెక్టర్ తడబడిపోవడం , రన్ టైమ్ ఎక్కువ కావడంతో సినిమా నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై విమర్శలు వచ్చాయి.
రుద్ర పోరాటం...
రుద్ర తన చెల్లి పెళ్లిని గ్రాండ్‌గా జరిపించాలని కలలు కంటుంటాడు. డబ్బు అవసరం కావడంతో ఓ గ్యాంగ్‌తో కలిసి బ్రహ్మ కమలం కోసం భైరవకోన వెళతాడు. అక్కడ జరిగిన ఓ ప్రమాదం నుంచి రుద్రను పార్వతి కాపాడుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. బ్రహ్మకమలం రుద్రం దగ్గర ఉందనే అనుమానంతో పార్వతి సాయంతో జుల్ఫికర్ అలీ...రుద్ర కుటుంబాన్ని అంతం చేస్తాడు. అసలు జుల్ఫీకర్ అలీ ఎవరు? అతడికి రుద్రతో ఉన్న శత్రుత్వానికి కారణమేమిటి? విరాట స్వామి ఆలయంలోని నాగబంధాన్ని ఛేదించాలని అనుకున్న జుల్ఫీకర్ అలీ ప్రయత్నాలను రుద్ర ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన రుద్రకు పార్వతి ఎందుకు ద్రోహం చేసింది అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | ఓటీటీలో తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – హీరోయినే విలన్‌గా మారితే!
జులై 23, 2026

OTT | అప్పుడే డెబ్బై కోట్ల బిజినెస్.. వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ ఓటీటీ డీల్ క్లోజ్.. ప్లాట్‌ఫామ్ ఏదంటే?
జులై 19, 2026

OTT | థియేటర్లలో బ్లాక్‌బస్టర్ – అయినా నెల రోజుల్లోనే ఓటీటీలోకి సమంత మా ఇంటి బంగారం
జులై 12, 2026
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు



