త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ – ఫ‌స్ట్ నైట్‌లో హీరో ఫెయిలైతే…

తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ మెన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. మెన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్‌లో శ్రీనాథ్ మాగంటి, కామాక్షి భాస్క‌ర్ల‌, గాయ‌త్రి ర‌మ‌ణ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

N

Entertainment | Published On Apr 23, 2026, 11.48 am IST

Telugu OTT | స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ – ఫ‌స్ట్ నైట్‌లో హీరో ఫెయిలైతే…
Advertisement

Telugu OTT | తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ మెన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శ్రీనాథ్ మాగంటి హీరోగా న‌టించిన ఈ సినిమాలో గాయ‌త్రి ర‌మ‌ణ‌, కామాక్షి భాస్క‌ర్ల క‌థానాయిక‌లుగా క‌నిపించారు. బాల స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అమెజాన్ ప్రైమ్‌లో....

మెన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్ గురువారం ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండా స‌డెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ తెలుగు మూవీ రిలీజైంది.
అడ‌ల్ట్ కామెడీకి మెసేజ్‌ను జోడించి ద‌ర్శ‌కుడు బాల స‌తీష్ మెన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్ సినిమాను తెర‌కెక్కించారు. మ‌ద్యానికి బానిస‌గా మారిన భ‌ర్త‌లో మార్పు తీసుకొచ్చేందుకు ఫ‌స్ట్ నైట్‌ను ఓ భార్య ఎలా అడ్డుపెట్టుకొని డ్రామా అడింద‌న్న‌ది బోల్డ్‌గా ఈ సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్‌. మెన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్‌ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. ఈ సినిమాలో బ‌ల‌గం ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మ‌ల్లేష్ ఫ‌స్ట్ నైట్ క‌ష్టాలు...

మ‌ల్లేష్ చిన్న‌ప్ప‌టి నుంచే తాగుడుకు అల‌వాటుప‌డ‌తాడు. మెన్ష‌న్‌ హౌజ్ లేనిదే ఏ ప‌ని చేయ‌లేడు. ఊళ్లోనే టెంట్‌హౌజ్ న‌డిపిస్తూ వ‌చ్చిన డ‌బ్బుల‌తో జ‌ల్సాలు చేస్తుంటాడు. జ్యోతి అనే యువ‌తిని పెళ్లి చేసుకుంటాడు మ‌ల్లేష్‌. కానీ ఫ‌స్ట్ నైట్ రోజు ఫెయిల‌వుతాడు. మ‌ల్లేష్‌కు శోభ‌నం కాలేద‌నే సంగ‌తి ఊరంతా తెలిసిపోతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? తాగుడు మానేయాల‌ని మ‌ల్లేష్ ఎందుకు నిర్ణ‌యించుకున్నాడు? ఊరి చిన్న ప‌టేల్ తో మ‌ల్లేష్‌కు ఉన్న గొడ‌వ‌లేమిటి? ప‌టేల్ భార్య ప‌ద్మ కార‌ణంగా మ‌ల్లేష్ కాపురం ఎలా నిల‌బ‌డింది అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.
మెన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్‌తో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా న‌టించాడు శ్రీనాథ్ మాగంటి. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, హిట్‌, ల‌క్కీ భాస్క‌ర్‌తో పాటు బాలీవుడ్ మూవీ యానిమ‌ల్‌లో డిఫ‌రెంట్ రోల్స్‌లో క‌నిపించాడు.

 

Advertisement
Advertisement