త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jailer 2 OTT | ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – నెల రోజుల్లోనే స్ట్రీమింగ్‌

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 త‌మిళంతో పాటు తెలుగులో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొద‌టిరోజు రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కాగా జైల‌ర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యింది. 160 కోట్ల భారీ ధ‌ర‌కు అమెజాన్ ప్రైమ్ ర‌జ‌నీకాంత్ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. న‌వంబ‌ర్ 12న జైల‌ర్ ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం ఉందంటూ వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Oct 15, 2026, 8.30 pm IST

Jailer 2 OTT | ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – నెల రోజుల్లోనే స్ట్రీమింగ్‌
Advertisement

Jailer 2 OTT | ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన జైల‌ర్ 2 గురువారం తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో రిలీజైంది. నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌, మిర్నా మీన‌న్‌, విద్యా బాల‌న్‌, ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ రోష‌న్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్ గెస్ట్ పాత్ర‌ల్లో న‌టించారు.

పాజిటివ్ టాక్‌...

జైల‌ర్ 2 సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. ర‌జ‌నీకాంత్ హీరోయిజం, ఎలివేష‌న్ల‌ను ప‌తాక స్థాయిలో డైరెక్ట‌ర్ నెల్స‌న్ ఆవిష్క‌రించాడంటూ చెబుతోన్నారు. గెస్ట్ రోల్స్‌ను వాడుకున్న తీరు, కామెడీ, అనిరుధ్ బీజీఎమ్ అదిరిపోయాయ‌ని ఫ్యాన్స్ నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తోన్నాయి. క‌థ‌లో కొత్త‌ద‌నం లేద‌ని, సెకండాఫ్‌ను థ్రిల్లింగ్‌గా ఆవిష్క‌రించ‌డంలో డైరెక్ట‌ర్‌ త‌డ‌బ‌డిపోయాంటూ విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.

రికార్డ్ క‌లెక్ష‌న్స్‌...

నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా తొలిరోజు జైల‌ర్ 2 రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

డిజిట‌ల్ రైట్స్‌...

కాగా జైల‌ర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యింది. ర‌జ‌నీకాంత్ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జైల‌ర్ పెద్ద హిట్ట‌వ‌డం, సీక్వెల్‌లో ర‌జ‌నీకాంత్‌తో పాటు ప‌లువురు స్టార్స్ న‌టించ‌డంతో జైల‌ర్ 2 ఓటీటీ రైట్స్ కోసం గ‌ట్టి పోటీ ఏర్ప‌డింది. తెలుగు, త‌మిళంతో పాటు మ‌రో మూడు భాష‌ల్లో క‌లిపి 160 కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది.

నాలుగు వారాల గ్యాప్‌లో...

థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేసేలా డీల్ కుదిరిన‌ట్లు స‌మాచారం. న‌వంబ‌ర్ 12న అమెజాన్ ప్రైమ్‌లో జైల‌ర్ 2 విడుద‌ల కావ‌చ్చునంటూ వార్త‌లొస్తున్నాయి. న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

జైల‌ర్ 2కు కొన‌సాగింపుగా జైల‌ర్ 3 కూడా ఉంటుంద‌ని క్లైమాక్స్‌లో ప్ర‌క‌టించారు. జైల‌ర్ 2 సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించారు.

 

Advertisement
Advertisement