Bold OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి తెలుగు అడల్ట్ కామెడీ మూవీ – డబుల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువే!
రీసెంట్‌గా థియేటర్లలో రిలీజైన తెలుగు అడల్ట్ కామెడీ మూవీ హుషారు పిట్టలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. అన్ష్, వాసవి గణేషన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిన్న సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
Entertainment | Published On Sep 15, 2026, 11.24 am IST
Bold OTT | తెలుగు అడల్ట్ కామెడీ మూవీ హుషారు పిట్టలు యూత్ ఆడియెన్స్‌ను మెప్పించింది. అన్ష్, వాసవి గణేషన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో గోవర్ధన్ రెడ్డి, అంజి వల్గుమాన్, ప్రమోదిని కీలక పాత్రల్లో నటించారు. భిక్షు దర్శకత్వం వహించాడు. ఆగస్ట్‌లో థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
హుషారు పిట్టలు మూవీ ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా మంగళవారం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. బోల్డ్ సీన్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో యువతరం ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. పిల్లలు చేసే తప్పుల వల్ల తల్లిదండ్రులు ఎలాంటి మానసిక క్షోభను అనుభవిస్తారు? సమాజం దృష్టిలో ఏ విధంగా దోషులుగా మిగిలిపోతారనే మెసేజ్ అందించాడు. హుషారు పిట్టలు మూవీకి చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించాడు. కోటిన్నర బడ్జెట్‌తో రూపొందిన ఈ చిన్న సినిమా ఐదు కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది.
ఇంటర్‌లో ప్రెగ్నెంట్ అయితే...
మాసినపల్లి రవి టెన్త్‌లో టాపర్. ఇంటర్‌లో జాయినైన రవి స్నేహితుల కారణంగా దారితప్పుతాడు. తన కాలేజీలోనే చదివే చిట్టితో ప్రేమలో పడతాడు. వారి ప్రేమాయణం శారీరక బంధంగా మారుతుంది. చిట్టి ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడటంతో ఇరు కుటుంబాల్లో గొడవలు మొదలవుతాయి. చివరకు ఈ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు చేరుతాయి. ఆ తర్వాత ఏమైంది? చిట్టి, రవి భవిష్యత్తు గురించి కుటుంబసభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
- ●Power Cut | విద్యుత్ బకాయిలపై ఉక్కుపాదం.. 747 గవర్నమెంట్ ఆఫీసులకు కరెంట్ కట్!
- ●Uniform Civil Code | UCC అమలుకు ముందే ఎన్డీయేలో లొల్లి.. అమిత్ షా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
- ●Oracle | ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే.. లేవగానే ఉద్యోగులకు పిడుగులాంటి వార్త చెప్పిన ఒరాకిల్
- ●UPI | రూ.2వేలు దాటితే యూపీఐ చార్జీలు చెల్లించాలా.. కేంద్రం స్పష్టత..
- ●Samantha | సమంత సీమంతం ఫొటోలు - హాజరైన అతిథులు ఎవరంటే?

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Power Cut | విద్యుత్ బకాయిలపై ఉక్కుపాదం.. 747 గవర్నమెంట్ ఆఫీసులకు కరెంట్ కట్!

Uniform Civil Code | UCC అమలుకు ముందే ఎన్డీయేలో లొల్లి.. అమిత్ షా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Oracle | ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే.. లేవగానే ఉద్యోగులకు పిడుగులాంటి వార్త చెప్పిన ఒరాకిల్






