Shivaji | శివాజీని మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలివే!
హీరోయిన్ల డ్రెస్‌ల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీ సోమవారం మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో మహిళా కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు శివాజీ సమాధానం ఇవ్వలేకపోయారట. తన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు శివాజీ ఈ విచారణలో పేర్కొన్నారు.
Entertainment | Published On Dec 27, 2025, 8.14 pm IST
Shivaji | హీరోయిన్ల డ్రెస్‌లపై చేసిన అనుచిత కామెంట్లకు సంబంధించి మహిళా కమిషన్ విచారణలో శివాజీ మరోసారి క్షమాపణలు చెప్పారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌ల గురించి శివాజీ కామెంట్లు చేశారు. కొన్ని అసభ్యకర మాటలు వాడారు. ఈ కామెంట్లపై మహిళా కమిషన్ అతడికి నోటీసులు పంపించింది. ఈ నోటీసులకు సంబంధించి శనివారం ఉదయం పదకొండు గంటలకు కమిషన్ ఎదుట శివాజీ విచారణకు హాజరయ్యారు. విచారణలో శివాజీ తన వ్యాఖ్యలపై మరోసారి క్షమాపణలు చెప్పారు. తన తప్పును అంగీకరించారు. ఈ విచారణ సందర్భంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద అడిగిన పలు ప్రశ్నలకు శివాజీ సమాధానం ఇవ్వలేక పోయారట. తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు మహిళా కమిషన్ సభ్యులతో శివాజీ అన్నారట. అంతే కాకుండా ఇక మీదట మహిళల గురించి మాట్లాడేటపుడు మర్యాద పూర్వకంగా నడుచుకుంటానని శివాజీ మహిళా కమిషన్ సభ్యులతో చెప్పారట.
సమాధానాలు చెప్పని శివాజీ
ఈ విచారణలో శివాజీపై ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద పలు ప్రశ్నలు సంధించారు. మహిళల దుస్తులే దాడులకు కారణమైతే....చిన్నారులు, వృద్ధ మహిళలపై జరుగుతున్న వేధింపులకు ఏ కారణం చెప్పగలరని శివాజీని ఛైర్ పర్సన్ ప్రశ్నించారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించినందుకు సినీ పరిశ్రమలోని మహిళలు వేధింపులకు గురవ్వడంపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందట. కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించవలసిన బాధ్యత మీకు లేదా? అంటూ శివాజీని మహిళా కమిషన్ ప్రశ్నించారు. ఇతరులను తమ అజమాయిషీ లో ఉంచడానికి అనుచిత వ్యాఖ్యలు చెయ్యరాదంటూ శివాజీని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మందలించినట్లు తెలిసింది.
ఆర్గనైజర్స్‌కు సూచన...
మహిళల పట్ల సమాజం పట్ల అంత గౌరవం ఉంటే హీరోయిన్ల డ్రెస్‌ల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దర్శకనిర్మాతలకు చెబితే బాగుంటుందని శివాజీకి మహిళా కమిషన్ సభ్యులు సూచించినట్లు సమాచారం. హీరోయిన్ల భద్రతలో ఈవెంట్ ఆర్గనైజర్స్ తగిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఈ విచారణలో సూచనలు జారీ చేసినట్లు తెలిసింది.
సంబంధిత వార్తలు

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Trisha | సూర్య, త్రిష మధ్య విభేదాలు? – చెన్నై క్వీన్‌ను అవమానించారంటూ ఫ్యాన్స్ ఫైర్
మే 18, 2026

Jacqueline Fernandez | మనీ లాండరింగ్ కేసులో ట్విస్ట్ – బాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురుదెబ్బ
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



