త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న విమ‌ర్శ‌ల‌పై తొమ్మిదేళ్ల‌ త‌ర్వాత య‌శ్ రియాక్ష‌న్

కెరీర్ ఆరంభంలో ర‌ష్మిక మంద‌న్న హీరో య‌శ్‌ను మిస్ట‌ర్ షో ఆఫ్ అంటూ విమ‌ర్శించింది. ర‌ష్మిక చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ర‌ష్మిక విమ‌ర్శ‌ల‌పై తొమ్మిదేళ్ల త‌ర్వాత య‌శ్ రియాక్ట్ అయ్యాడు.

N

Entertainment | Published On Aug 16, 2026, 1.24 pm IST

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న విమ‌ర్శ‌ల‌పై తొమ్మిదేళ్ల‌ త‌ర్వాత య‌శ్ రియాక్ష‌న్
Advertisement

Rashmika Mandanna | నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న 2017లో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో క‌న్న‌డ హీరో య‌శ్‌ను విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేసింది. ర‌ష్మిక కామెంట్ల‌పై తొమ్మిదేళ్ల త‌ర్వాత య‌శ్ రియాక్ట్ అయ్యాడు. ఎదుటివారి అభిప్రాయాలు త‌న వ్య‌క్తిత్వాన్ని మార్చ‌లేవ‌ని అన్నారు. ర‌ష్మిక మంద‌న్న కెరీర్ క‌న్న‌డ సినిమాల‌తోనే మొద‌లైంది. కెరీర్ ఆరంభంలో చ‌మ‌క్ అనే సినిమా ప్ర‌మోష‌న్స్‌లో య‌శ్ గురించి యాంక‌ర్ ఆడిగిన ప్ర‌శ్న‌కు మిస్ట‌ర్ షో ఆఫ్ అంటూ రిప్లై ఇచ్చింది. త‌న గురించి గొప్ప‌లు చెప్ప‌కుంటూ బిల్డ‌ప్‌లు ఎక్కువ‌గా ఇస్తుంటాడ‌ని ఇన్‌డైరెక్ట్‌గా అత‌డిపై కామెంట్లు చేసింది. ర‌ష్మిక కామెంట్ల‌పై య‌శ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వివాదం ముద‌ర‌డంతో ర‌ష్మిక క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

నేనేంటో నాకు తెలుసు...

ర‌ష్మిక విమ‌ర్శ‌ల‌పై టాక్సిక్ ప్ర‌మోష‌న్స్‌లో య‌శ్ రియాక్ట్ అయ్యాడు. "ఆమె ఏ ఉద్దేశంతో ఆ కామెంట్లు చేసిందో తెలియ‌దు. కొన్ని సార్లు టీవీ షోల‌లో ఓ ప్ర‌శ్న‌కు నాలుగైదు ఆప్ష‌న్లు ఇస్తుంటారు. వాటిలో ఏదో ఒక‌టి ఎంచుకోమ‌ని చెబుతుంటారు. ర‌ష్మిక విష‌యంలో అదే జ‌రిగి ఉంటుంటుంది. ఉన్న ఆప్ష‌న్ల‌లో నాకు అదే స‌రిపోతుంద‌ని భావించి ఉంటుంది. ఆమె వ్యాఖ్య‌ల‌పై క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోని చాలా మంది అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ర‌ష్మిక‌ను త‌ప్పుప‌ట్టారు. కానీ ఆ విమ‌ర్శ‌ల‌ను నేను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌మ అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకునే స్వేచ్ఛ ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. ఎదుటివారి అభిప్రాయాలు నా వ్య‌క్తిత్వాన్ని మార్చ‌లేవు. నేను ఏంటో నాకు తెలుసు" అని య‌శ్ అన్నారు. అత‌డి కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

ఆగ‌స్ట్ 26న రిలీజ్‌...

య‌శ్ హీరోగా న‌టించిన టాక్సిక్ ఆగ‌స్ట్ 26న రిలీజ్ కాబోతుంది. న‌య‌న‌తార‌, రుక్మిణి వసంత్‌, కియారా అద్వానీ, తారా సుతారియా హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీకి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

 

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement