త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhil Raj | జ‌రిగింది తెలియ‌కుండా నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు – డెలివ‌రీ బాయ్‌తో గొడ‌వ‌పై రాజు వెండ్స్ రాంబాయి హీరో క్లారిటీ

డెలివ‌రీ బాయ్‌తో రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ గొడ‌వ ప‌డిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. డెలివ‌రీ బాయ్ ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేక‌పోవ‌డంతో అత‌డితో వాగ్వివాదం జ‌రిగింద‌ని అన్నాడు.

N

Entertainment | Published On Jun 30, 2026, 7.03 pm IST

Akhil Raj |  జ‌రిగింది తెలియ‌కుండా నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు – డెలివ‌రీ బాయ్‌తో గొడ‌వ‌పై రాజు వెండ్స్ రాంబాయి హీరో క్లారిటీ
Advertisement

Akhil Raj |  డెలివ‌రీ బాయ్‌తో రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ గొడ‌ప‌డిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఫుడ్ డెలివ‌రీ చేయ‌డానికి వ‌చ్చిన త‌న‌ను అఖిల్ రాజ్ కొట్టాడ‌ని, అత‌డి ఇంట్లో వాళ్లు దారుణంగా అవ‌మానించారంటూ స‌ద‌రు డెలివ‌రీ బాయ్ ఈ వీడియోలో పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అఖిల్ రాజ్‌దే త‌ప్పంటూ ఈ వీడియోను ఉద్దేశించి ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు పెట్టారు. హీరో ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేదంటూ ట్రోల్ చేశారు. ఈ గొడ‌వ‌పై అఖిల్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

ఆడ్ర‌స్ మారిపోయింది...

మా అమ్మ‌తో దురుసుగా మాట్లాడ‌టంతోనే డెలివ‌రీబాయ్‌తో గొడ‌వ‌ప‌డ్డాన‌ని అఖిల్ రాజ్ అన్నాడు. "మా ఇంటి ఎదురుగా ఉన్నఅపార్ట్‌మెంట్‌లో ఇవ్వాల్సిన  ఆర్డ‌ర్‌ను డెలివ‌రీ బాయ్ మాకు ఇచ్చాడు. పార్సిల్‌పై డెలివ‌రీ అడ్రెస్ స్ప‌ష్టంగా ఉంది. అయినా డెలివ‌రీ బాయ్ వెరిఫై చేసుకోకుండా మా నాన్నకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. క‌నీసం ఓటీపీ, పేరు కూడా ఆడ‌గ‌లేదు. మా ఇంట్లో నాతో పాటు న‌లుగురం ఉంటాం. మాలోనే ఒక‌రం ఆర్డ‌ర్ చేశామని అనుకొని అమ్మ ప్యాకెట్ ఓపెన్ చేసింది. ఆర్డ‌ర్ మాది కాద‌ని తెలిసిన త‌ర్వాత ప‌క్క‌న‌పెట్టాం. ఇర‌వై నిమిషాల త‌ర్వాత ఆర్డ‌ర్ తిరిగి తీసుకోవ‌డానికి డెలివ‌రీ బాయ్ వ‌చ్చాడు. అడ్రెస్ స‌రిగ్గా చూసుకున్నావా అని అడిగితే లేదంటూ నిర్ల‌క్ష్యంగా బ‌దులిచ్చాడు. తెలియక ఓపెన్ చేశాను. ఏమీ అనుకోవ‌ద్దు అంటూ మా అమ్మ పార్శిల్ తిరిగి ఇచ్చేసింది. ఫ్రీగా వ‌స్తే ఓపెన్ చేస్తారా అంటూ దురుసుగా మాట్లాడాడు. మా అమ్మ‌ను అలా అన‌డంతోనే కోపంతో అత‌డితో గొడ‌వ ప‌డ్డా. కుటుంబ‌స‌భ్యుల‌ను త‌క్కువ చేసి మాట్లాడితే ఎవ‌రికైనా కోపం వ‌స్తుంది . ప‌ని గ‌ట్టుకొని డెలివ‌రీ బాయ్‌తో గొడ‌వ ప‌డాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఆ గొడ‌వ వ‌ల్ల నాకు వ‌చ్చేది ఏం లేదు. జ‌రిగింది తెలియ‌కుండా నాపై చాలా మంది నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. న‌న్ను, నా కుటుంబ‌స‌భ్యుల‌ను అన‌రాని మాట‌లు అంటున్నారు. డెలివ‌రీ బాయ్ తాగి వచ్చాడు. అతడి ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేక‌పోవ‌డంతోనే అలా చేయాల్సివ‌చ్చింది. ఈ గొడ‌వ‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశా" అని అఖిల్ రాజ్ ఈ వీడియోలో పేర్కొన్నాడు.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌....

రాజు వెడ్స్ రాంబాయి మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ రాజ్‌. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత ఈషా అనే హార‌ర్ మూవీలో న‌టించాడు.

Advertisement
Advertisement