త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddar Awards | కొత్త కేట‌గిరీల‌లో గ‌ద్ద‌ర్ ఫిల్మ్స్ అవార్డులు – ఎంట్రీల‌కు ఆహ్వానం – లాస్ట్ డేట్ ఇదే

2025 ఏడాదిలో రిలీజైన సినిమాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను అంద‌జేయ‌బోతుంది. ఇందుకు గాను అర్హులైన నిర్మాతలు త‌మ ఎంట్రీల‌ను ఫిబ్ర‌వ‌రి 3వ తేదీలోపు స‌మ‌ర్పించాల‌ని తెలంగాణ ఎఫ్‌డీసీ ఎండీ ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Jan 22, 2026, 3.25 pm IST

Gaddar Awards | కొత్త కేట‌గిరీల‌లో గ‌ద్ద‌ర్ ఫిల్మ్స్ అవార్డులు – ఎంట్రీల‌కు ఆహ్వానం – లాస్ట్ డేట్ ఇదే
Advertisement

Gaddar Awards | 2025 గ‌ద్ద‌ర్ ఫిల్మ్స్ అవార్డ్స్ కోసం తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఎంట్రీల‌ను ఆహ్వానిస్తోంది. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఫిబ్ర‌వ‌రి మూడు చివ‌రి తేదీ అని ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వెల్ల‌డించారు. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్స‌హించ‌డానికి గ‌త ఏడాది నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను అంద‌జేస్తుంది. నంది అవార్డుల స్థానంలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ గ‌ద్ద‌ర్ అవార్డుల వేడుక‌ గ‌త ఏడాది వైభ‌వంగా జ‌రిగింది. 2014 నుంచి 2014 వ‌ర‌కు రిలీజైన అన్ని సినిమాల‌కు గ‌త ఏడాది అవార్డుల‌ను అంద‌జేశారు. 2025 ఏడాదికి సంబంధించిన‌ గ‌ద్ద‌ర్ ఫిల్మ్స్ అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలంగాణ ఎఫ్‌డీసీ ప్ర‌క‌టించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేషన్ పొందిన సినిమాల‌కు అవార్డులు అంద‌జేస్తామ‌ని ఎఫ్‌డీసీ ఎండీ వెల్ల‌డించారు.

కొత్త కేట‌గిరీలు...

ఫీచ‌ర్ ఫిల్మ్స్‌తో జాతీయ సమైక్యతను పెంపొదించే సినిమాలు, పర్యావరణం, హెరిటేజ్, చరిత్ర, సామాజిక చైతన్యం, బాలల చిత్రాలు, చలన చిత్ర రంగంలో టెక్నీషియన్లు, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్స్,సినిమా రంగంపై బుక్స్ తదితర రంగాలలో ఈ అవార్డులు ప్రదానం చేస్తామ‌ని తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న అవార్డు కేట‌గిరీల‌తో పాటు ఈసారి కొత్తగా మ‌రికొన్ని విభాగాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సామాజిక స్పృహను ప్రతిబింబించే చిత్రాలకు ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం పేరుతో అవార్డు అంద‌జేస్తామ‌ని అన్నారు. స్పెష‌ల్‌జ్యూరీ కేట‌గిరీలో డా. సి. నారాయణరెడ్డి అవార్డులను అంద‌జేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

చివరి తేదీ...

2025 గద్దర్ అవార్డులకు అర్హులైన నిర్మాతలు, ఇతర దరఖాస్తుదారులు అవార్డులకు సంబంధించిన అప్లికేష‌న్‌ పత్రాలు, మార్గదర్శకాలను 2026 జ‌న‌వ‌రి 31 వరకు పొందవచ్చని, ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.ఈ అవార్డుల వివరాలకు https:/filmin.telangana.gov.in అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపే దరఖాస్తులను సమర్పించాలని ఎఫ్‌డీసీ ఎండీ కోరారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement