Bhagyashri Borse | లవ్‌లెటర్‌కు భాగ్యశ్రీ బోర్సే క్రేజీ రియాక్షన్ – నెట్టింట వైరల్ అవుతోన్న పోస్ట్
ఓ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం సోమవారం విజయవాడ వచ్చిన భాగ్యశ్రీ బోర్సేకు ఊహించని అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఆమెకు లవ్ లెటర్ ఇచ్చాడు. ఆ అభిమాని ప్రేమకు భాగ్యశ్రీ ఫిదా అయ్యింది.
Entertainment | Published On Apr 6, 2026, 2.58 pm IST
Bhagyashri Borse | రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది భాగ్యశ్రీ బోర్సే. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌తో పాటు రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తెలుగులో ఒక్క సక్సెస్ లేకపోయినా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాలతో అగ్ర హీరోయిన్ల స్థాయిలో భాగ్యశ్రీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లు ఈ అమ్మడి క్రేజ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ప్రస్తుతం తెలుగులో లెనిన్‌తో పాటు తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం సోమవారం విజయవాడలో సందడి చేసింది భాగ్యశ్రీ. అక్కడ అమెకు ఊహించని అనుభవం ఎదురైంది.
అభిమాని నుంచి ప్రేమలేఖ...
ఓ అభిమాని నుంచి ప్రేమలేఖను అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అతడు తనపై చూపించిన ప్రేమకు భాగ్యశ్రీ ఫిదా అయ్యింది. ఆ లవ్ లెటర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. లెటర్‌తో పాటు తానే స్వయంగా పెన్సిల్‌తో భాగ్యశ్రీ బొమ్మను వేశాడు సదరు అభిమాని. ఆ బొమ్మను కూడా భాగ్యశ్రీకి ఇచ్చాడు. ఓ గులాబీ పువ్వును అందించాడు. "మీ పాత్రలు నాకు స్ఫూర్తి. తెరపై మీరు పండించే భావోద్వేగాలు, పాత్ర కోసం మీరు పడే తపన నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. మీ నటన నా జీవితాన్ని మార్చింది. మీతో కలిసి నటించే చిన్న అవకాశం కోసం ఎన్ని ఏళ్లు అయినా ఎదురుచూస్తా. అది నాకు లక్ష్యం మాత్రమే కాదు.... నా జీవిత ఆశయం...మీతో కొన్ని నిమిషాలు గడిపినా అవి నా జీవితానికి ఎంతో విలువైనవి" అంటూ ఈ లెటర్‌లో సదరు అభిమాని రాశాడు.మీ లవ్ నాకు స్ఫూర్తి అంటూ అభిమాని లేఖకు రిప్లై ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.
లెనిన్ పోస్ట్‌పోన్...
కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన లెనిన్ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలుత ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. రామ్‌చరణ్ పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతుండటంతో ఈ సినిమా కోసం వాయిదావేశారు.
సంబంధిత వార్తలు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
ఆగస్టు 13, 2026

Vijay Deverakonda | డీసీ మూవీని మిస్ చేసుకున్న తెలుగు హీరో – అసలేం జరిగిందంటే?
ఆగస్టు 8, 2026

Meta Platforms | మెటా ప్లాట్‌ఫామ్స్ ఒక పబ్లిక్ న్యూసెన్స్.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థకు రూ.5400 కోట్ల జరిమానా..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు
- ●Tamannaah | హీరోతో గొడవలు - సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు - చిక్కుల్లో తమన్నా బాలీవుడ్ మూవీ?
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?

Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది

Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు



