త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా తొలి అవార్డు – గ‌ర్వంగా ఉంద‌న్న ర‌ష్మిక మంద‌న్న‌

గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వేడుక‌లో ర‌ష్మిక మంద‌న్న ఎమోష‌న‌ల్ అయ్యింది. తెలంగాణ కోడ‌లిగా తొలి అవార్డును అందుకోవడం గ‌ర్వంగా ఉందంటూ చెప్పింది.

N

News | Published On Mar 20, 2026, 10.03 am IST

Rashmika Mandanna  | తెలంగాణ కోడ‌లిగా తొలి అవార్డు  – గ‌ర్వంగా ఉంద‌న్న ర‌ష్మిక మంద‌న్న‌
Advertisement

Rashmika Mandanna |  గ‌ద్ద‌ర్ అవార్డ్స్ వేడుక‌లో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఎమోష‌న‌ల్ అయ్యింది. తెలంగాణ కోడ‌లిగా తాను అందుకుంటున్న తొలి అవార్డు ఇదంటూ చెప్పింది. ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీకిగాను బెస్ట్ హీరోయిన్‌గా గ‌ద్ద‌ర్ అవార్డుకు ర‌ష్మిక ఎంపికైన సంగ‌తి తెలిసిందే. గురువారం హైద‌రాబాద్‌లోని హైటెక్స్ క‌న్వెన్ష‌న్‌లో గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ వేడుక‌లో సీఎం రేవంత్ రెడ్డి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ చేతుల మీదుగా అవార్డును అందుకుంది ర‌ష్మిక మంద‌న్న‌.

ఎంతో స్పెష‌ల్‌...

అవార్డు స్వీక‌రించిన అనంత‌రం ర‌ష్మిక ఎమోష‌న‌ల్ అయ్యింది. త‌న‌కు ఈ అవార్డు ఎంతో స్పెష‌ల్ అని చెప్పింది. "ఒక‌ప్పుడు నా న‌ట‌న‌ను చాలా మంది ట్రోల్ చేశారు. ఆ స్థాయి నుంచి బెస్ట్ హీరోయిన్‌గా స్టేట్ అవార్డు అందుకునే లెవెల్‌కు చేరుకోవ‌డం ఆనందంగా ఉంది. మ‌రిన్ని డిఫ‌రెంట్ సినిమాలు చేయాడానికి గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాతో పాటు గ‌ద్ద‌ర్‌ అవార్డు ఓ స్ఫూర్తిగా నిలిచాయి. చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్‌లో అడుగుపెట్టిన‌ప్పుడు ఓ కూతురిలా నాపై ప్రేమ‌ను చూపించారు. ఈ రోజు అఫీషియ‌ల్‌గా తెలంగాణ కోడ‌లిగా మీ ముందు నిల‌బ‌డి ఈ అవార్డును అందుకోవ‌డం గ‌ర్వంగా అనిపిస్తుంది. నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాల‌న్న‌దే నా కోరిక" అని ర‌ష్మిక అన్న‌ది.

ర‌ష్మిక స్పీచ్‌కు....

ఈ అవార్డు వేడుక‌కు త‌న త‌ల్లి సుమ‌న్ మంద‌న్న‌, అత్తయ్య దేవ‌ర‌కొండ మాధ‌వితో క‌లిసి అటెండ్ అయ్యింది ర‌ష్మిక మంద‌న్న‌. ర‌ష్మిక స్పీచ్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి మాధ‌వి కూడా భావోద్వేగానికి లోనైంది. క‌న్నీళ్లు పెట్టుకుంది.
బెస్ట్ హీరోయిన్‌గా నిలిచిన ర‌ష్మిక‌కు ప‌ది ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తితో పాటు సిల్వ‌ర్ మెమోంటోను అంద‌జేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.
కాగా ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీకి రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో భూమాదేవి పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది ర‌ష్మిక మంద‌న్న‌. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ మూవీ మంచి హిట్టైంది.
కాగా ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఏడ‌డుగులు వేసింది ర‌ష్మిక మంద‌న్న‌. మూడేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న ఈ జంట ఫిబ్ర‌వ‌రి 26న మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. ప్ర‌స్తుతం విజ‌య్‌, ర‌ష్మిక క‌లిసి ర‌ణ‌బాలి అనే సినిమా చేస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement