త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teja Sajja | అనుమానం పెనుభూతం కాదు..ప్రియ‌నేస్తం – బిగ్‌బాస్‌కు పోటీగా కొత్త రియాలిటీ షో – హోస్ట్‌గా హ‌నుమాన్ హీరో

బిగ్‌బాస్‌కు పోటీగా మ‌రో కొత్త రియాలిటీ షో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ది ట్రైట‌ర్స్ పేరుతో రూపొందుతోన్న ఈ షోకు తేజా స‌జ్జా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్టోబ‌ర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. అచ్చం బిగ్‌బాస్‌లానే ఈ షో ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Sep 29, 2026, 5.00 pm IST

Teja Sajja | అనుమానం పెనుభూతం కాదు..ప్రియ‌నేస్తం – బిగ్‌బాస్‌కు పోటీగా కొత్త రియాలిటీ షో – హోస్ట్‌గా హ‌నుమాన్ హీరో
Advertisement

Teja Sajja |బిగ్‌బాస్‌కు పోటీగా మ‌రో కొత్త రియాలిటీ షో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. ఈ షో టైటిల్‌తో పాటు హోస్ట్ ఎవ‌ర‌న్న‌ది వెల్ల‌డైంది. ది ట్రైట‌ర్స్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ తెలుగు రియాలిటీ షో అక్టోబ‌ర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. హ‌నుమాన్‌, మిరాయ్ సినిమాల హీరో తేజా స‌జ్జా ది ట్రైట‌ర్స్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ప్రోమో రిలీజ్‌...

ఈ రియాలిటీ షో ప్రోమోను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. మోసం అనే కాన్సెప్ట్ చుట్టూ ది ట్రైట‌ర్స్ సాగ‌నున్న‌ట్లు ఈ ప్రోమోలో తేజా స‌జ్జా వెల్ల‌డించాడు. "ప్ర‌పంచంలో అంద‌రూ మంచోళ్లే...మోసం చేసే అవ‌కాశం రానంత‌వ‌ర‌కు..ప్రేమ‌.. అధికారం... యుద్ధం..గెలుపు కోసం...యుగాలు మారినా, కార‌ణాలు ఏవైనా మోసం మాత్రం మార‌లేదు. మోసం ఇప్పుడు వేషం మార్చుకొని వ‌స్తోంది. మాస్క్ వేసుకొని వ‌స్తోంది... ఇక్క‌డ అనుమానం పెనుభూతం కాదు..ప్రియ‌నేస్తం..ఇక్క‌డ అంద‌రూ మోసం చేస్తారు...మోస‌పోతారు అంటూ ఈ ప్రోమోలో తేజా స‌జ్జా చెప్పిన డైలాగ్స్ ఆస‌క్తిని పంచుతున్నాయి.

ఇర‌వై మంది కంటెస్టెంట్స్‌...

తేజా స‌జ్జా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ది ట్రైట‌ర్స్ షోలో మొత్తం ఇర‌వై మంది కంటెస్టెంట్‌లు పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. సినిమా, టీవీతో పాటు సోష‌ల్ మీడియా సెలిబ్రిటీలు ఈ షోలోకి కంటెస్టెంట్‌లుగా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. వారు ఎవ‌ర‌న్న‌ది అక్టోబ‌ర్ 15న స్ట్రీమింగ్ అయ్యే ఫ‌స్ట్ ఎపిసోడ్‌తో రివీల్ కానుంది.

ప‌దిహేను కోట్లు...

తేజా స‌జ్జా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఫ‌స్ట్ షో ఇదే. ఈ ఓటీటీ షో కోసం హ‌నుమాన్ హీరో ప‌దిహేను కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్‌బాస్ త‌ర‌హాలోనే సాగే ది ట్రైట‌ర్స్ హిందీలో పెద్ద విజ‌యాన్ని సాధించింది. హిందీ వెర్ష‌న్‌కు బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

రెండు గ్రూపులుగా ...

ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్‌ను... ట్రైట‌ర్స్‌...ఇన్నోసెంట్స్ అనే రెండు గ్రూపులుగా హోస్ట్ విభ‌జిస్తాడు. ట్రైట‌ర్స్‌ను ఇన్నోసెంట్స్ క‌నిపెడితే వారు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇన్నోసెంట్స్‌ల‌లో ఒక‌రిని ఆట నుంచి ఎలిమినేట్ చేయ‌డానికి ట్రైట‌ర్స్ ర‌క‌ర‌కాల టాస్క్‌లు ఇస్తారు. వీటి ద్వారా ప్ర‌తివారం ఒక‌రిని గేమ్ నుంచి బ‌య‌ట‌కు పంపిస్తారు. చివ‌ర‌కు ఆట‌లో మిగిలిన కంటెస్టెంట్ విన్న‌ర్‌గా నిలుస్తాడు.

Advertisement
Advertisement