Teja Sajja | బిగ్‌బాస్‌కు పోటీగా తెలుగులో మరో గేమ్ షో – హోస్ట్‌గా హనుమాన్ హీరో
బిగ్‌బాస్‌కు పోటీగా తెలుగులో మరో కొత్త రియాలిటీ షో లాంఛ్ కాబోతుంది. ది ట్రైటర్స్ పేరుతో రాబోతున్న ఈ షోకు తేజా సజ్జా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ షో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Mar 20, 2026, 6.31 pm IST
Teja Sajja | బిగ్‌బాస్‌కు పోటీగా తెలుగులో మరో కొత్త రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఈ షో టైటిల్‌తో పాటు హోస్ట్ ఎవరన్నది రివీలైంది. ది ట్రైటర్స్ హాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ టీవీ షోస్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. గతంలో వచ్చిన రియాలిటీ షోస్‌కు భిన్నంగా సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ది ట్రైటర్స్‌ను లాంఛ్ చేశారు.
కరణ్ జోహార్ హోస్ట్...
ఇటీవలే ది ట్రైటర్స్ షో హిందీలోకి వచ్చింది. ది ట్రైటర్స్ ఇండియా పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో టెలికాస్ట్ అవుతోన్న సైకలాజికల్ గేమ్ షోకు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ షో ఓటీటీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
హనుమాన్ హీరో...
తాజాగా ది ట్రైటర్స్ తెలుగులోనూ లాంఛ్ కాంబోతుంది. ఈ తెలుగు గేమ్ షోకు హనుమాన్ హీరో తేజా సజ్జా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. గురువారం ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో ది ట్రైటర్స్ తెలుగు గేమ్ షోను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. తేజా సజ్జాను హోస్ట్‌గా ప్రకటించారు.
భారీగానే రెమ్యూనరేషన్...
తొలుత ఈ షో కోసం తారక్, నానితో పాటు మరికొందరు స్టార్ హీరోలను హోస్ట్‌గా తీసుకోవాలని అనుకున్నారట. డేట్స్ ఇష్యూ కారణంగా వారు ఈ షో చేయలేకపోవడంతో ఈ అవకాశం తేజా సజ్జాను వరించినట్లు టాక్ వినిపిస్తోంది.
ది ట్రైటర్స్ షో కోసం తేజా సజ్జా భారీగానే రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు సమాచారం. ఈ షోలో తేజా సజ్జా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారట. హోస్ట్‌గా అతడి స్టైల్, ఎనర్జీ ది ట్రైటర్స్‌కు మరింత ప్రత్యేకత తీసుకువస్తుందని మేకర్స్ చెబుతోన్నారు.
విల్లాలో...
ది ట్రైటర్స్ షో ఒక రిమోట్ లొకేషన్‌లో ఉన్న కోట లేదా విల్లాలో జరుగుతుంది. ఇందులో పోటీదారులు ఫెయిత్‌ఫుల్స్, ది ట్రైటర్స్ రెండు గ్రూపులుగా విడిపోతారు. హోస్ట్ రహస్యంగా ఎంపిక చేసిన కొద్దిమందిని ట్రైటర్స్ అంటారు. వీరు ప్రతి రాత్రి ఒక ఫెయిత్‌ఫుల్ గేమ్ నుండి ఎలిమినేట్ చేయాలి. చివరలో మిగిలిన వారు ఫెయిత్‌ఫుల్స్ అయితే ప్రైజ్ మనీ పంచుకుంటారు. ఒకవేళ ఒక్క ట్రైటర్స్ మిగిలితే మొత్తం సొమ్ము వారికే దక్కుతుంది. ఇందులో బిగ్‌బాస్ మాదిరి టాస్క్‌లు, గేమ్స్ ఉంటాయి.ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతోందట. త్వరలోనే షో లాంఛింగ్ డేట్‌తో పాటు కంటెస్టెంట్స్ వివరాలను రివీల్ చేయబోతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




