Bigg Boss | బిగ్‌బాస్ హోస్ట్‌గా టీమిండియా కెప్టెన్ – హయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌తో రికార్డ్
బిగ్‌బాస్ షోలోకి టీమిండియా క్రికెటర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే కంటెస్టెంట్‌గా కాదు...హోస్ట్‌గా అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఆ క్రికెటర్ ఎవరంటే?
Entertainment | Published On Jul 20, 2026, 7.16 pm IST
Bigg Boss | బిగ్‌బాస్...ఇండియాలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ రియాలిటీ షోస్‌లో ఒకటిగా గుర్తింపును సొంతం చేసుకుంది. హిందీతో పాటు పలు భాషల్లో బిగ్‌బాగ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ బిగ్‌బాస్ షోస్‌కు హోస్ట్‌లుగా స్టార్ హీరోలు వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ హిందీకి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చాలా ఏళ్లుగా కొనసాగుతోన్నారు. బిగ్‌బాస్ తెలుగుతో నాగార్జున, కన్నడ బిగ్‌బాస్‌తో కిచ్చా సుదీప్ అభిమానులను మెప్పిస్తున్నారు. సినిమా హీరోలు కాకుండా ఫస్ట్ టైమ్ టీమిండియా క్రికెటర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.
రెమ్యూనరేషన్ ఎంతంటే?
బిగ్‌బాస్ బెంగాళీ షోతో హోస్ట్‌గా అభిమానుల ముందుకు రాబోతున్నాడు గంగూలీ. ఈ షో కోసం టీమిండియా మాజీ క్రికెటర్ 125 కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. బిగ్‌బాస్ బెంగాళీతో ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ రికార్డ్‌ను క్రియేట్ చేయబోతున్నట్లు చెబుతోన్నారు. గంగూలీకి గతంలో కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నటనపై పెద్దగా ఆసక్తి లేక వాటిని వదిలేసుకున్నారు. అలాంటి ఆయన బిగ్‌బాస్ షోకు ఓకే చెప్పడం ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు హిందీ, బెంగాళీ భాషల్లో బిగ్‌బాస్ షో లాంఛ్ కానున్నట్లు సమాచారం.
దాదా...బయోపిక్...
టీమిండియా తరఫున 311 వన్డేలు, 113 టెస్ట్‌లు ఆడాడు గంగూలీ. వన్డేల్లో 11363 పరుగులు, టెస్టుల్లో 7212 రన్స్ చేశాడు. బౌలర్‌గా కూడా వన్డేల్లో 171, టెస్టుల్లో 99 వికెట్లు తీశాడు.
గంగూలీ జీవితం ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీ రాబోతుంది. ఈ బయోపిక్‌కు దాదా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది మేలో దాదా రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | థియేటర్లలో బ్లాక్‌బస్టర్ – అయినా నెల రోజుల్లోనే ఓటీటీలోకి సమంత మా ఇంటి బంగారం
జులై 12, 2026

Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ – సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..
జూన్ 26, 2026

OTT | డేటింగ్ కాన్సెప్ట్‌తో రియాలిటీ షో – బిగ్‌బాస్‌కు పోటీగా స్ట్రీమింగ్ – హోస్ట్‌గా సీనియర్ హీరోయిన్
జూన్ 18, 2026
తాజావార్తలు
- ●Atal Pension Yojana | నెలకు రూ.5వేల పెన్షన్ కావాలా.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరండి..
- ●Lava Virat V1 | లావా విరాట్ వి1 సిరీస్ లాంచ్.. రూ.8,999 నుంచే 5జి, భారీ బ్యాటరీ ఫోన్లు..
- ●Manne Krishank | కేటీఆర్ చెప్పిందే నిజమైంది.. కానీ కేంద్ర మంత్రులు ఆయన్ని ఎగతాళి చేసిండ్రు
- ●BJP Ramchandar Rao | ఇకనుంచి ఏ పరీక్ష పేపర్ లీకైనా 10 ఏండ్ల జైలు.. 15 కోట్ల ఫైను
- ●Students Protest | విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపితే డబ్బులు ఇస్తామన్నారు.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్!
- ●Medical Student | ఐదో అంతస్తు నుంచి దూకి.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

Atal Pension Yojana | నెలకు రూ.5వేల పెన్షన్ కావాలా.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరండి..

Lava Virat V1 | లావా విరాట్ వి1 సిరీస్ లాంచ్.. రూ.8,999 నుంచే 5జి, భారీ బ్యాటరీ ఫోన్లు..

Manne Krishank | కేటీఆర్ చెప్పిందే నిజమైంది.. కానీ కేంద్ర మంత్రులు ఆయన్ని ఎగతాళి చేసిండ్రు

BJP Ramchandar Rao | ఇకనుంచి ఏ పరీక్ష పేపర్ లీకైనా 10 ఏండ్ల జైలు.. 15 కోట్ల ఫైను



