Sreeleela | టీమిండియా క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్ – రూమర్లలో నిజమెంత?
టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఏడాది కాలంగా వీరిద్దరి సీక్రెట్ డేటింగ్ సాగుతుందని సమాచారం. తిలక్ వర్మ, శ్రీలీల లవ్‌స్టోరీ గురించి ఇరువురి కుటుంబసభ్యులకు కూడా తెలుసునని అంటున్నారు.
Entertainment | Published On May 17, 2026, 3.51 pm IST
Sreeleela | గత కొద్ది రోజులుగా సినిమాలతో కంటే డేటింగ్ రూమర్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది శ్రీలీల. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరిగింది. కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేస్తోంది. ఈ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లోనే కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమలో పడిందని, వీరిద్దరి పెళ్లికి కుటుంబసభ్యులు ఒకే చెప్పారంటూ వార్తలొచ్చాయి. ఈ ప్రేమ, పెళ్లి వార్తలు ఊహాగానాలే అంటూ ఈ ధమాకా బ్యూటీ కొట్టిపడేసింది.
ఏడాదికాలంగా...
ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పడి కొద్ది రోజులు కూడా కాకముందే శ్రీలీలపై మరో కొత్త రూమర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్‌లో ఉందని అంటున్నారు. ఏడాదికాలంగా వీరిద్దరి మధ్య సీక్రెట్ లవ్‌స్టోరీ నడుస్తుందట. నాలుగైదు నెలల క్రితం శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను దర్శించుకున్నది. అదే రోజు సేమ్ టైమ్‌లో తిలక్ వర్మ కూడా తిరుమలలో కనిపించారు. వీరిద్దరు తిరుమల రావడం కాకతాళీయం అని ఫ్యాన్స్‌ను భావించారు. కానీ జంటగానే దేవుడి దర్శనం చేసుకున్నట్లు బయటపడింది.
ఐపీఎల్ మ్యాచ్‌లో...
ఇటీవల ముంబై ఇండియన్, పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు శ్రీలీల తల్లి హాజరైంది. తిలక్ వర్మతో పాటు మిగిలిన ముంబై ఇండియన్ ప్లేయర్స్‌తో ఆమె ముచ్చటిస్తూ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అంతుకుమందు ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు కూడా శ్రీలీల అటెండ్ అయ్యింది. తిలక్ వర్మ కోసమే ఆమె మ్యాచ్‌లు చూడటానికి వచ్చినట్లు చెబుతోన్నారు. వీరిద్దరి సీక్రెట్ లవ్‌స్టోరీ గురించి తిలక్ వర్మ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కుటుంబసభ్యులకు తెలుసునని సమాచారం. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొనే ప్రేమ వ్యవహారం బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారట. కొందరు నెటిజన్లు ఈ లవ్‌స్టోరీ నిజమేనని చెబుతోండగా...మరికొందరు మాత్రం రూమర్ అంటూ కొట్టిపడేస్తున్నారు.
ఉస్తాద్ భగత్‌సింగ్‌పై ఆశలు
ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. ట్రిపుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లతో టాలీవుడ్‌కు దూరమైంది. ఈ ఏడాది రిలీజైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ పవన్ కళ్యాణ్ మూవీ కూడా ఆమెను గట్టెక్కించలేకపోయింది. దాంతో టాలీవుడ్‌పై ఆశలు వదులుకున్న శ్రీలీల కోలీవుడ్, బాలీవుడ్‌పై ఫోకస్ పెడుతోంది. తమిళంలో ధనుష్‌తో ఓ సినిమా చేస్తోంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ ఆషికీ 3తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



