త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు – ఒక‌టి హార‌ర్ – మ‌రోటి థ్రిల్ల‌ర్‌

తెలుగు సినిమాలు డ్యూయ‌ల్‌, బ‌హుముఖం సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చాయి. శుక్ర‌వారం నుంచి డ్యూయ‌ల్ మూవీ ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీ...బ‌హుముఖం బుక్ మై షో స్ట్రీమింగ్ యాప్‌లో రిలీజ‌య్యాయి.

N

Entertainment | Published On Jan 9, 2026, 7.12 pm IST

Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు – ఒక‌టి హార‌ర్ – మ‌రోటి థ్రిల్ల‌ర్‌
Advertisement

Telugu OTT | తెలుగు సినిమాలు డ్యూయ‌ల్‌, బ‌హుముఖం శుక్ర‌వారం ఓటీటీలోకి వ‌చ్చాయి. డ్యూయ‌ల్ మూవీ ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోండ‌గా..బ‌హుముఖం బుక్‌మై షో యాప్‌లో రిలీజైంది.

హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌...

డ్యూయ‌ల్ మూవీలో వ‌ల్ల‌భ‌తేజ‌, రోషిని, అర‌వింద‌క్ష‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సురేష్‌ సాగిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తేజ ఓ మ‌త్య్స‌కారుడు. ఆర్థిక ఇబ్బందుల్లో అత‌డికి ఓ భారీగా న‌గ‌దు ఉన్న బ్యాగ్ దొరుకుతుంది. అందులోని డ‌బ్బు త‌న అవ‌స‌రాల‌కు వాడుకుంటాడు. అప్ప‌టినుంచి అత‌డిని ఓ క్రిమిన‌ల్ గ్యాంగ్ వెత‌క్కుంటూ వ‌స్తారు. తేజ‌కు తెలియ‌కుండా మ‌రో ప్యార‌లాల్ వ‌ర‌ల్డ్ ఉంద‌నే నిజం కూడా బ‌య‌ట‌ప‌డుతుంది. చివ‌ర‌కు తేజ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? దొరికిన డ‌బ్బు అత‌డి జీవితంలో ఎలాంటి విషాదాన్ని నింపింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

రెండేళ్ల త‌ర్వాత‌....

బ‌హుముఖం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ హ‌ర్షివ్ కార్తీక్‌, స్వ‌ర్ణిమ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఫ‌ణి క‌ళ్యాణ్ మ్యూజిక్ అందించారు.
త‌న్వీర్ ఓ నేరం చేసి జైలుకు వెళ‌తాడు. జైలు నుంచి విడుద‌లైన అత‌డు న‌టుడిగా మారాల‌ని క‌ల‌లు కంటాడు. ఆడిష‌న్‌కు వెళ్లిన ప్ర‌తిచోట అవ‌మానాలు ఎదుర‌వుతాయి. సైకో కిల్ల‌ర్ పాత్ర స‌రిగ్గా చేయ‌లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. దాంతో నిజంగానే కిల్ల‌ర్‌గా మారుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? దిశ అనే థెర‌ఫిస్ట్‌కు త‌న్వీర్‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌. హీరో హ‌ర్షివ్ కార్తీక్ ఈ మూవీకి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ రెండు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement