త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taylor Swift | పెళ్లి కోసం 190 కోట్ల ఖ‌ర్చు – రిట‌ర్న్ గిఫ్ట్‌గా డైమండ్స్ – గ్రాండ్‌గా పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్ వెడ్డింగ్

ఇంట‌ర్నేష‌న‌ల్ పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్ పెళ్లి చేసుకుంది. ప్రియుడు ట్రావిస్‌తో టేల‌ర్ వివాహం న్యూయార్క్‌లోని మాడిస‌న్ స్క్వేర్‌లో శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగింది. పెళ్లి కోసం వీరిద్ద‌రు ఐదు వంద‌ల కోట్ల‌కుపైగా ఖ‌ర్చు చేశార‌ట‌.

N

Entertainment | Published On Jul 4, 2026, 7.01 pm IST

Taylor Swift | పెళ్లి కోసం 190 కోట్ల ఖ‌ర్చు – రిట‌ర్న్ గిఫ్ట్‌గా డైమండ్స్ – గ్రాండ్‌గా పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్ వెడ్డింగ్
Advertisement

Taylor Swift |  ఇంట‌ర్నేష‌న‌ల్ పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఎన్ఎఫ్ఎల్ ప్లేయ‌ర్ ట్రావిస్‌తో టేల‌ర్ స్విఫ్ట్ పెళ్లి న్యూయార్క్‌లోని మాడిస‌న్ స్క్వేర్‌లో ఘ‌నంగా జ‌రిగింది. వ‌ర‌ల్డ్‌లోనే కాస్ట్‌లీయెస్ట్ వెడ్డింగ్‌ల‌లో ఒక‌టిగా వీరి వివాహ వేడుక జ‌రిగింది.

ఐదు వంద‌ల కోట్ల ఖ‌ర్చు...

ఈ పెళ్లి కోసం మొత్తంగా ఐదు వంద‌ల కోట్ల‌కుపైనే టేల‌ర్ స్విఫ్ట్‌, ట్రావిస్ ఖ‌ర్చు చేశార‌ట‌. కేవ‌లం వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌, రిట‌ర్న్ గిఫ్ట్‌ల కోస‌మే 190 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్లు స‌మాచారం. పెళ్లికి ముందు స‌న్నిహితుల కోసం స్విఫ్ట్‌, ట్రావిస్ ఓ స్పెష‌ల్ డిన్న‌ర్ ఏర్పాటు చేశార‌ట‌. ఈ వెడ్డింగ్ డిన్న‌ర్‌కు సెలీనా గోమేజ్‌, బ్లాడ్లీ కూప‌ర్‌, జాక్ ఆంటోనాఫ్‌, లెనా డ‌న్షామ్‌తో పాటు ప‌లువురు హాలీవుడ్ సెలిబ్రిటీలు అటెండ్ అయ్యారు. అతిథుల కోసం ఒరిజిన‌ల్ డైమండ్స్‌తో కూడిన ల‌గ్జ‌రీ షాంపేన్ ఫ్లూట్ (గ్రాస్‌)ను బ‌హుమ‌తిగా అంద‌జేశార‌ట‌. డైమండ్స్‌తో కూడిన గిఫ్ట్ బాక్స్‌తో పార్టీలో హాలీవుడ్ సెలిబ్రిటీలు క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ గిఫ్ట్ బాక్స్‌పై టీటీ (టేల‌ర్ స్విప్ట్‌, ట్రావిస్ ) పేర్లు షార్ట్‌క‌ట్‌లో క‌నిపిస్తున్నాయి.

ఛారిటీ కోసం

మాడిస‌న్ స్క్వేర్ రెంట్ ఒక్క రాత్రికి ప‌ది కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. ఈ వేదిక‌ను ఐదారు రోజుల పాటు బుక్ చేసుకున్నార‌ట‌. సెక్యూరిటీ, డెక‌నేష‌న్‌, డ్రెస్సుల కోసం భారీగానే ఖ‌ర్చు అయ్యింద‌ట‌. పెళ్లికి ముందు వివిధ ఛారిటీ సంస్థ‌ల‌కు విరాళంగా రెండు వంద‌ల యాభై కోట్ల వ‌ర‌కు ఇచ్చార‌ట‌.

మూడేళ్ల ప్రేమాయ‌ణం....

గ‌త మూడేళ్లుగా ట్రావిస్‌తో టేల‌ర్ స్విఫ్ట్ ప్రేమ‌లో ఉంది. ఓ కాన్సెర్ట్‌లో వీరి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ట‌. 2025లో టేల‌ర్ స్విఫ్ట్‌కు ట్రావిప్ ప్ర‌పోజ్ చేశాడు. ప్రేమ‌ను వ్య‌క్తం చేసిన ఏడాది త‌ర్వాత పెళ్లి పీట‌లు ఎక్కారు.

రిచెస్ట్ సింగ‌ర్‌

వ‌ర‌ల్డ్‌లోనే రిచెస్ట్ సింగ‌ర్‌ల‌లో ఒక‌రిగా టేల‌ర్ స్విఫ్ట్ కొన‌సాగుతోంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ 16700 కోట్ల‌కుపైనే ఉంటుంది. కాన్సెర్ట్‌లు, రాయ‌ల్టీల‌తో ప్ర‌తి ఏటా వేల కోట్లు సంపాదిస్తోంది టేల‌ర్ స్విఫ్ట్‌.

Advertisement
Advertisement