OTT Review | కాళిదాస్ 2 రివ్యూ – ట్విస్ట్‌లతో సాగే తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ప్రేమిస్తే భరత్ హీరోగా నటించిన తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కాళిదాస్ 2 లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Entertainment | Published On May 14, 2026, 7.59 pm IST
OTT Review |ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా నటించిన తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కాళిదాస్ 2 ఇటీవలే లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో రిలీజైంది. భవానీ శ్రీ, సంగీత మాధవన్ నాయర్, అజయ్ కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీ సెంథిల్ దర్శకత్వం వహించాడు. ఓటీటీలో తమిళంతో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే?
వరుస హత్యలు...
చెన్నైలోని ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో న్యూ ఇయర్ రోజు నాలుగేళ్ల చిన్నారి మిస్సవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఇన్వేస్టిగేట్ చేసే బాధ్యతను డీఎస్‌పీ వైష్ణవితో (భవానీ శ్రీ) పాటు ఎస్ఐ కాళిదాస్ (భరత్) చేపడతారు. మిస్సింగ్ అయిన తర్వాత రోజు ఆ చిన్నారి డెడ్‌బాడీ పోలీసులకు దొరుకుతుంది. అదే గేటెడ్ కమ్యూనిటీకి చెందిన ఓ డాక్టర్‌తో పాటు మరో చిన్నారి కూడా అనుమానస్పద రీతిలో చనిపోతారు. ఈ హత్యలకు అదే అపార్ట్‌మెంట్స్‌లో ఉండే లాయర్ స్టీఫెన్‌కు (అజయ్ కార్తీ) సంబంధం ఉందని కాళిదాస్‌తో పాటు వైష్ణవి అనుమానిస్తారు. స్టీఫెన్‌కు నేరచరిత్ర ఉందనే నిజం కూడా బయటపడుతుంది. కానీ స్టీఫెన్ మాత్రం తాను ఆ మర్డర్స్ చేయలేదని వాదిస్తాడు. కాళిదాస్ ఇన్వేస్టిగేషన్‌లో ఎలాంటి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి? అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? గేటెడ్ కమ్యూనిటీ సెక్రటరీ రూపకు (సంగీత మాధవన్) ఈ మర్డర్‌కు ఎలాంటి సంబంధం ఉంది? అసలు స్టీఫెన్ ఎవరు? లాయర్ నటరాజ్ (ప్రకాష్ రాజ్) అతడిని ఎందుకు కాపాడాడు? అన్నదే కాళిదాస్ 2 మిగిలిన కథ.
క్లైమాక్స్ ట్విస్ట్...
గతంలో దర్శకులు కథలు రాసుకొని...అందులో రెండో మూడో ట్విస్ట్‌లు ఉండేలా జాగ్రత్త పడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్విస్ట్‌లను ముందు రాసుకొని వాటి చుట్టూ కథలను అల్లుకుంటున్నారు. కాళిదాస్ 2 చూస్తే ఇదే అనిపిస్తుంది. కేవలం ఒకే ఒక క్లైమాక్స్ ట్విస్ట్‌ను నమ్ముకొని దర్శకుడు శ్రీ సెంథిల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అదొక్కటి మినహా మిగిలిన సినిమా అంతా రొటీన్. పోనీ ఆ మలుపు అయిన వావ్ అనిపించేలా ఉంటుందా అంటే అదీ లేదు.
రొటీన్ కథే...
మర్డర్ మిస్టరీ సినిమాలు చాలా వరకే ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. ఎలాంటి క్లూస్ లేకుండా మర్డర్స్ జరగడం...పోలీసులు ఓ అమాయక వ్యక్తిని అనుమానించడం...చివరకు ఎవరూ ఊహించిన సాధారణ మనిషి కిల్లర్ అని రివీల్ కావడం ఈ కథల్లో కామన్‌గా కనిపిస్తుంది. ఈ పాయింట్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కాళిదాస్ కూడా అలాంటి రొటీన్ కథే. ఈ పాత కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
భరత్, భవానీ శ్రీ ఇన్వేస్టిగేషన్ సీన్లు టీవీ సీరియల్‌ను తలపిస్తాయి. డీఎస్‌పీ వైష్ణవి రోల్, ఆమె చెప్పే డైలాగ్స్ చిరాకును తెప్పిస్తాయి. స్టీఫెన్ క్యారెక్టర్ అనుమానం రేకెత్తించే సన్నివేశాలు, అతడి గతాన్ని ఇంట్రెస్టింగ్‌గా రాసుకుంటే బాగుండేది.
లాజిక్‌లెస్...
అప్పటివరకు స్టీఫెన్ విలన్ అంటూ అనుమానించిన హీరో సడెన్‌గా కిల్లర్‌ను పట్టేయడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. ముందే చెప్పినట్లు క్లైమాక్స్ అదిరిపోయింది. కంప్లీట్‌గా ఆ క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో చూపించకుండా మూడో పార్ట్‌కు లీడ్ ఇచ్చి వదిలేశారు.
భరత్ ఫిట్...
సినిమాలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారు. కానీ ఎవరిని దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు. పోలీస్ ఆఫీసర్ రోల్‌కు భరత్ సరిగ్గా ఫిట్ అయ్యాడు. అతడి యాక్టింగ్ బాగుంది. ఇంటెన్స్ క్యారెక్టర్‌లో అజయ్ కార్తీ తేలిపోయాడు. భవానీ శ్రీ, అబర్నతితో పాటు మిగిలిన వాళ్ల నటన అంతంత మాత్రమే. సంగీత మహదేవన్ నాయర్ రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంది. సామ్ సీఎస్ బీజీఎమ్ బాగుంది.
కాళిదాస్ 2 ...థ్రిల్లర్ మూవీ లవర్స్‌ను కొంత వరకు మెప్పిస్తుంది. కొత్తదనాన్ని ఆశిస్తే మాత్రం కష్టమే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Crime Thriller OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో సాగే తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – ఒకే రోజు మూడు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్
మే 10, 2026

Malayalam OTT | తెలుగులో రిలీజైన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – పోలీస్‌పై కామన్ మ్యాన్ రివేంజ్
ఏప్రిల్ 18, 2026

OTT | ఓటీటీలోకి మంచు లక్ష్మి తమిళ్ రొమాంటిక్ మూవీ – విజయ్ ఆంటోనీ ప్రొడ్యూసర్
మార్చి 5, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



