త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Immortal Movie Review | ర‌క్తం తాగే ఏలియ‌న్‌ అంద‌మైన అమ్మాయిగా మారితే – క‌య‌దు లోహ‌ర్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?

జీవీ ప్ర‌కాష్ కుమార్‌, క‌య‌దు లోహ‌ర్ జంట‌గా న‌టించిన త‌మిళ మూవీ ఇమ్మోర్ట‌ల్ ఇటీవ‌ల సోనీలీవ్ ఓటీటీలో రిలీజైంది. హార‌ర్ ఫాంట‌సీగా రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టిందా? లేదా? అంటే?

N

Entertainment | Published On Nov 1, 2026, 7.03 pm IST

Immortal Movie Review | ర‌క్తం  తాగే ఏలియ‌న్‌ అంద‌మైన అమ్మాయిగా మారితే – క‌య‌దు లోహ‌ర్ హార‌ర్ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Immortal Movie Review | క‌య‌దు లోహ‌ర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ ఇమ్మోర్ట‌ల్ సోనీలివ్ ఓటీటీలో (OTT)  స్ట్రీమింగ్ అవుతోంది. జీవీ ప్ర‌కాష్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు మ‌రియ‌ప్ప‌న్ చిన్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హార‌ర్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా (Horror Movie) తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

మ్యాగీ...సింధు ప్రేమ‌క‌థ‌...

మ్యాగీ (జీవీ ప్ర‌కాష్ కుమార్‌) ఓ ప్రింటింగ్‌ప్రెస్‌లో ప‌నిచేస్తుంటాడు. చాలీచాల‌ని జీతంతో క‌ష్టాలు ప‌డుతుంటాడు. మ్యాగీ అద్దెకు ఉంటున్న ఇంటిని ఓన‌ర్ కూల్చేయాల‌ని అనుకుంటాడు. మ‌రో అద్దె ఇంటి కోసం వెత‌క‌డం మొద‌లుపెడ‌తాడు మ్యాగీ. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అత‌డి బ‌డ్జెట్‌లో ఇళ్లు దొర‌క‌దు. అదే టైమ్‌లో అప‌రిచిత నంబ‌ర్ నుంచి మ్యాగీకి కాల్ వ‌స్తుంది. సింధు అనే అమ్మాయి ఫోన్ చేసి త‌న ఫ్లాట్‌లో రెంట్ షేర్ చేసుకొని ఉండొచ్చ‌ని అంటుంది. సింధు అందం చూసి ఫ్లాటైపోయిన మ్యాగీ ఓకే చెబుతాడు. కొద్ది ప‌రిచ‌యంలోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. ఆ ఫ్లాట్‌లో సింధుతో క‌లిసి ఆమె తాత వికాస్ ఉంటాడు. వికాస్ ద్వారా సింధు అమ్మాయి కాద‌ని, మ‌నుషుల ర‌క్తం తాగి బ‌తికే ఓ వింత  ఏలియన్ అనే నిజం తెలుస్తుంది.

ఆ ఆపార్ట్‌మెంట్‌లోకి రావ‌డ‌మే కానీ ప్రాణాల‌తో బ‌య‌ట‌కు వెళ్లిన వారు ఎవ‌రూ లేర‌నే నిజం కూడా మ్యాగీ తెలుసుకుంటాడు. అక్క‌డి నుంచి పారిపోవాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన బ‌య‌ట‌కు వెళ్లే దారి క‌నిపించ‌దు. సింధు బారి నుంచి మ్యాగీ త‌ప్పించుకున్నాడా? వెయ్యేళ్ల క్రితం నాటి ఆ జంతువు సింధు రూపంలో ఎందుకు ఉంది? ఆ వింత జంతువు క‌థేమిటి? సింధు ఉంటున్న అపార్ట్‌మెంట్ కేవ‌లం మ్యాగీకి మాత్ర‌మే క‌నిపించి...ఇత‌రుల‌కు క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ల‌గ్జ‌రీస్‌...

త‌క్కువ ధ‌ర‌ల్లో దొరికే ల‌గ్జ‌రీస్ వెనుక కొన్నిసార్లు ఊహించ‌ని ప్ర‌మాదాలు పొంచి ఉంటాయి. కోట్ల విలువ చేసే ఓ వ‌స్తువు వేల రూపాయ‌ల‌కే ఇస్తామ‌ని అంటే ముందు వెనుక ఆలోచించ‌కుండా ఆవేశంగా కొని ఆ త‌ర్వాత ఇబ్బందులు ప‌డేవాళ్లు చాలా మందే ఉంటారు. ఇమ్మోర్ట‌ల్ మూవీ కూడా అలాంటిదే. ఓ అమ్మాయి అందం చూసి మోస‌పోయిన ఓ యువ‌కుడు ఆమె ట్రాప్‌లో ఎలా చిక్కుకున్నాడు? బందీఖానా నుంచి బ‌య‌ట‌ప‌డానికి ఏం చేశాడ‌నే అంశాల‌తో ద‌ర్శ‌కుడు మ‌రియ‌ప్ప‌న్ చిన్న ఈ సినిమాను తెర‌కెక్కించారు.

గంట‌న్న‌ర‌...

ఇమ్మోర్ట‌ల్‌కు ఫాంట‌సీ ఎలిమెంట్ కీల‌కం. కానీ రెండు గంట‌ల ప‌ది నిమిషాల ర‌న్‌టైమ్ తో కూడిన ఈ సినిమాలో ఆ ఫాంట‌సీ ఎలిమెంట్‌కు అర‌గంట టైమ్ కేటాయిస్తే....క‌య‌దు లోహ‌ర్ అందాల ప్ర‌ద‌ర్శ‌న కోసం మిగిలిన గంట న‌ల‌భై సినిమాలు కేటాయించారు డైరెక్ట‌ర్‌. సినిమా మొత్తాన్ని హాట్ సీన్ల‌తో నింపేశారు. క్లోజ‌ప్ షాట్స్‌, కెమెరా యాంగిల్స్ చూస్తుంటే ఇది హార‌ర్ సినిమానా...లేదంటే బోల్డ్ మూవీ చూస్తున్నామా అనే ఫీలింగ్ క‌లుగుతుంది. గ్లామ‌ర్ డోస్ చాలా ఎక్కువైపోయింది.

ట్విస్ట్‌లు హైలైట్‌...

సింధు అమ్మాయి కాద‌ని హీరో తెలుసుకునే సీన్ నుంచే మ‌ళ్లీ క‌థ గాడిలో ప‌డుతుంది. ఆ త‌ర్వాత వ‌చ్చే ట్విస్ట్‌లు బాగున్నాయి. అపార్ట్‌మెంట్ నుంచి త‌ప్పించుకోవాల‌ని అనుకున్న హీరో మ‌ళ్లీ అక్క‌డికే రావ‌డం, గేటెడ్ క‌మ్యూనిటీ మొత్తంలో సింధు త‌ప్ప ఎవ‌రూ లేర‌ని క‌నిపెట్ట‌డం, ఆ బిల్డింగ్ ఎవ‌రికి క‌నిపించ‌క‌పోవ‌డం లాంటి మ‌లుపులును బాగా రాసుకున్నారు. ఆ విచిత్ర‌జీవిని హీరో చంపే సీన్ లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా సోసోగానే ఉంది.

గ్లామ‌ర్ అట్రాక్ష‌న్‌...

ఇమ్మోర్ట‌ల్‌కు క‌య‌దు గ్లామ‌ర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌... వింత జంతువుగా భ‌య‌పెట్ట‌డం కంటే గ్లామ‌ర్‌తోనే ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంది. క‌య‌దు ప‌క్క‌న జీవీ ప్ర‌కాష్ త‌మ్ముడిలా క‌నిపించాడు. సినిమా మొత్తం ఒకే అపార్ట్‌మెంట్‌లో షూట్ చేశారు. త‌క్కువ బ‌డ్జెట్‌లోనే తెర‌కెక్కించారు. గ్రాఫిక్స్, తెలుగు డ‌బ్బింగ్ బాగున్నాయి.

ఇమ్మోర్ట‌ల్  లో హార‌ర్ క‌థ‌ను క‌య‌దు గ్లామ‌ర్ డామినేట్ చేసింది

ట్యాగ్స్:

GV Prakash KumarImmortal MovieImmortal Telugu ReviewKayadu LoharKayadu Lohar Horror MovieOtt ReviewSony Liv OttTamil Movie
Advertisement
Advertisement