త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | రెమ్యూన‌రేష‌న్ లేకుండా ఫ్రీగా సినిమా – శోభిత ధూళిపాళ‌ త‌మిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!

శోభిత ధూళిపాళ త‌మిళ మూవీ వెట్టువ‌మ్ డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ పీరియాడిక‌ల్ మూవీకి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య శృతి హాస‌న్ ఓ గెస్ట్ రోల్ లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రెమ్యూన‌రేష‌న్ లేకుండా ఫ్రీగా శృతి హాస‌న్ ఈ సినిమా చేసిన‌ట్లు చెబుతోన్నారు.

N

Entertainment | Published On Oct 10, 2026, 4.54 pm IST

Shruti Haasan | రెమ్యూన‌రేష‌న్ లేకుండా ఫ్రీగా సినిమా – శోభిత ధూళిపాళ‌ త‌మిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!
Advertisement

Shruti Haasan |  పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్మాల్ గ్యాప్ ఇచ్చిన అక్కినేని కోడ‌లు శోభిత ధూళిపాళ ప్ర‌స్తుతం త‌మిళంలో వెట్టువ‌మ్ పేరుతో ఓ సినిమా చేస్తోంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పీరియాడిక‌ల్ మూవీలో ఆర్య‌, దినేష్, క‌లైయార‌స‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో వెట్టువ‌మ్‌ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

75 కోట్ల బ‌డ్జెట్‌తో...

దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ కోలీవుడ్ మూవీలో శోభిత ధూళిపాళ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్స్‌, ప్రాచీన యుద్ధ విద్య‌ల్లో శోభిత ట్రైనింగ్ తీసుకుంది. పూర్తిస్థాయి యాక్ష‌న్ పాత్ర‌లో శోభిత న‌టిస్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది.

గెస్ట్ రోల్‌...

వెట్టువ‌మ్‌కు సంబంధించి కోలీవుడ్ వ‌ర్గాల్లో మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో మ‌ల‌యాళ అగ్ర హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో పాటు క‌మ‌ల్ త‌న‌య శృతి హాస‌న్ గెస్ట్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం ఇద్ద‌రు దాదాపు మూడు రోజులు షూటింగ్ కూడా చేసిన‌ట్లు చెబుతున్నారు.

రూపాయి తీసుకోకుండా...

ఈ గెస్ట్ రోల్ కోసం ఒక్క రూపాయి కూడా శృతి హాస‌న్ రెమ్యూన‌రేష‌న్ తీసుకోలేద‌ని స‌మాచారం. పా రంజిత్ చెప్పిన క‌థ‌తో పాటు ద‌ర్శ‌కుడిపై అభిమానంతో ఫ్రీగా ఈ సినిమాలో న‌టించిన‌ట్లు చెబుతోన్నారు. క‌మ‌ల్ త‌న‌య పాత్ర‌తోనే వెట్టువ‌మ్ క‌థ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. శృతి హాస‌న్‌తో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్ పాత్ర‌ల నిడివి త‌క్కువే అయినా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌ర్వాత‌...

వెట్టువ‌మ్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఈ సినిమాకు ఓ ప్రొడ్యూస‌ర్‌గా కూడా పా రంజిత్ వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తోన్నారు. కాగా పొన్నియ‌స్ సెల్వ‌న్ త‌ర్వాత త‌మిళంలో శోభిత ధూళిపాళ న‌టిస్తోన్న మూవీ ఇది.

మ‌రోవైపు హీరోయిన్‌ పాత్ర‌ల‌కు దూర‌మైన శృతి హాస‌న్ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ ఎంచుకుంటోంది. దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగు మూవీ ఆకాశంలో ఒక తార‌లో బోల్డ్ రోల్ చేస్తోంది. న‌వంబ‌ర్ 20న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement