త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crime Thriller OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో సాగే త‌మిళ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – ఒకే రోజు మూడు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్‌

ప్రేమిస్తే భ‌ర‌త్ హీరోగా న‌టించిన త‌మిళ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ కాళిదాస్ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఒకే రోజు మూడు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఏ ఓటీటీల‌లో...ఎప్ప‌టి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?

N

Entertainment | Published On May 10, 2026, 5.55 pm IST

Crime Thriller OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో సాగే త‌మిళ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – ఒకే రోజు మూడు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్‌
Advertisement

Crime Thriller OTT |  ప్రేమిస్తే ఫేమ్ భ‌ర‌త్ హీరోగా న‌టించిన లేటెస్ట్ త‌మిళ మూవీ కాళిదాస్ 2 ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు శ్రీ సెంథిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అజ‌య్ కార్తీ, సంగీత మ‌హ‌దేవ‌న్‌, భ‌వానీ శ్రీ, ప్ర‌కాష్ రాజ్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సీక్వెల్‌...

భ‌ర‌త్ హీరోగా న‌టించిన కాళిదాస్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కింది. ఫ‌స్ట్ పార్ట్‌ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌డంతో కాళిదాస్ 2పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోలేక‌పోయిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

మూడు ఓటీటీల‌లో...

తాజాగా కాళిదాస్ 2 మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మే 12న ఒకే రోజు మూడు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అవుతోంది. స‌న్ నెక్స్ట్‌తో పాటు షార్ట్‌ఫిక్స్‌, సింప్లీ సౌత్ ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
కాన్సెప్ట్‌తో పాటు కొన్ని ట్విస్ట్‌లు మాత్రం బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వ‌చ్చిన మ‌లుపు గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తుందంటూ పేర్కొన్నారు. సినిమా ఫెయిలైన పోలీస్ ఆఫీస‌ర్‌గా భ‌ర‌త్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ...

ఓ గేటెడ్ క‌మ్యూనిటీకి చెందిన నాలుగేళ్ల పాప మిస్స‌వుతుంది. ఆ చిన్నారి మిస్సింగ్ కేసును కాళిదాస్ చేప‌డ‌తాడు. అత‌డి ఇన్వేస్టిగేష‌న్‌లో ఆ పాప చ‌నిపోయింద‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. ఆ చిన్నారితో పాటు మ‌రికొన్ని డెడ్‌బాడీస్ పోలీసుల‌కు దొరుకుతాయి. చ‌నిపోయిన వారంద‌రూ ఒకే గేటెడ్ క‌మ్యూనిటీకి చెందిన వారు కావ‌డంతో కాళిదాస్‌తో పాటు మ‌రో పోలీస్ వైష్ణ‌వి ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుంటారు. వారి ఇన్వేస్టిగేష‌న్‌లో ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌న్న‌దే ఈ సినిమా మిగిలిన క‌థ‌.

 

Advertisement
Advertisement