Jana Nayagan | జన నాయగన్ వచేస్తున్నాడు.. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్..
Jana Nayagan | ఎట్టకేలకు తలపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ కానున్నది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. గతంలో జూలై 24న విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఒక రోజు ముందుగానే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. విదేశీ డిస్ట్రిబ్యూటర్లకు సైతం కొత్త రిలీడ్ డేట్‌పై సమాచారం అందించారు.
Entertainment | Published On Jul 15, 2026, 3.50 pm IST
Jana Nayagan | ఎట్టకేలకు తలపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ కానున్నది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. గతంలో జూలై 24న విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఒక రోజు ముందుగానే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. విదేశీ డిస్ట్రిబ్యూటర్లకు సైతం కొత్త రిలీడ్ డేట్‌పై సమాచారం అందించారు. దాంతో ఆస్ట్రేలియా, యూరప్‌లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. విడుదల తేదీని ప్రకటిస్తూ కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఆరు నెలలు ఆలస్యంగా..
వాస్తవానికి ఈ మూవీని ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు తొలుత నిర్ణయించారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)లో సర్టిఫికెట్ నిలిచిపోవడంతో రిలీజ్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. 2025 డిసెంబర్ 18న చిత్రాన్ని సీబీఎఫ్‌సీకి సమర్పించగా.. పరిశీలన కమిటీ కొన్ని కట్స్ సూచిస్తూ.. యూ/ఏ 16 ప్లస్ సర్టిఫికెట్ ఇవ్వాలని సిఫారసు చేసింది. మార్పులు చేసిన తర్వాత మళ్లీ దరఖాస్తు చేసినా.. విడుదలకు కొద్ది రోజుల ముందు చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపాలని సీబీఎఫ్‌సీ నిర్ణయించింది. దాంతో రిలీజ్‌కు ఇక్కట్లు ఎదురయ్యాయి. ఆ తర్వాత నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. అనంతరం న్యాయపోరాటాన్ని మేకర్స్ కొనసాగిస్తూ వచ్చారు. చివరకు నిర్మాతలు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోగా.. సీబీఎఫ్‌సీ చిత్రానికి 'ఏ' (A) సర్టిఫికెట్ మంజూరు చేసింది. జూలై 9న జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాల 11 సెకన్లు (183 నిమిషాలు 11 సెకన్లు)గా ఉంది.
లీక్‌తో ఎదురుదెబ్బ
సర్టిఫికేషన్ వివాదం కొనసాగుతున్న సమయంలో ఏప్రిల్‌లో ఈ సినిమా పైరసీ బారిన పడింది. తొలుత కొన్ని సన్నివేశాలే బయటకు వచ్చాయని భావించినా.. తర్వాత రూ.500 కోట్లకు పైగా వ్యయంతో రూపొందిన మొత్తం సినిమా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్‌తో పాటు పలు టోరెంట్ వెబ్‌సైట్లలో చక్కర్లు కొట్టినట్లుగా తేలింది. దీంతో నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ తమిళనాడులో తెల్లవారుజామున 5 గంటల ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఉండదని సమాచారం. రాష్ట్రంలో తొలి షో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, కర్నాటక కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక షో వేయనున్నారు. యూకే డిస్ట్రిబ్యూటర్ అహింస ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా అన్‌కట్ వెర్షన్‌లో విడుదల కానుంది. జులై 24 నుంచి సినిమా ప్రదర్శించనున్నారు.
విజయ్ చివరి సినిమా..
హెచ్ వినోత్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విజయ్ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రం కావడంతో 'జన నాయగన్' మూవీపై భారీ అంచనాలున్నాయి.
Tested by fire.
Forged by time.
Built for history.
The tougher the battle,
The louder the victory.#JanaNayaganFromJuly23#JanaNayakuduFromJuly23#JanNetaFromJuly23The Hon'ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol… pic.twitter.com/21xjixgUBM
— KVN Productions (@KvnProductions) July 15, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●LPG cylinder | ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి
- ●MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో మొదలైన అమ్మకాల ఒత్తిడి..
- ●Tummala Nageshwar Rao | మరో 5 లక్షల మెట్రిక్ టన్నులకు వేర్ హౌసింగ్ సామర్థ్యం
- ●Etala Rajender | మూసీ కంటే అధ్వాన్నంగా జవహర్‌నగర్ డంప్ యార్డ్.. రేవంత్ సర్కార్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం
- ●Tasmac Cooling Charge Scam | రూ.160 బీరుకు రూ.170.. సీఎం విజయ్‌కు యువకుడి ఫిర్యాదు.. VIDEO

LPG cylinder | ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి

MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్

Stock Markets | స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో మొదలైన అమ్మకాల ఒత్తిడి..

Tummala Nageshwar Rao | మరో 5 లక్షల మెట్రిక్ టన్నులకు వేర్ హౌసింగ్ సామర్థ్యం






