Sreeleela | ఎస్ఎస్ఎస్ – శ్రీలీల డ్రీమ్‌బాయ్‌లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!
ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ధమాకా బ్యూటీ శ్రీలీల ఆసక్తికర కామెంట్లు చేసింది. తనకు కాబోయే జీవిత భాగస్వామిలో ఎస్ఎస్ఎస్ మూడు లక్షణాలుంటే సరిపోతుందని అన్నది. ఇంతకుమించి తనకు పెద్దగా కోరికలేం లేవని తెలిపింది. ఆమె కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jul 13, 2026, 4.22 pm IST
Sreeleela | కాబోయే జీవిత భాగస్వామిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అడగటమే ఆలస్యం...హీరోయిన్లు పెద్ద లిస్ట్ చెబుతుంటారు. తాము కోరుకున్న లక్షణాలున్న వ్యక్తి దొరికేవరకు ఎదురుచూస్తామని అంటుంటారు. అంతే కానీ డ్రీమ్ బాయ్ విషయంలో రాజీపడేది లేదని ఖరాఖండీగా చెప్పేస్తుంటారు. కలల రాకుమారుడి విషయంలో ధమాకా బ్యూటీ శ్రీలీలకు మాత్రం పెద్ద కోరికలేవి లేవట. ఎస్ఎస్ఎఎస్ అనే మూడు క్వాలిటీస్ ఉంటే చాలని అంటోంది.
మూడు లక్షణాలు...
ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి శ్రీలీల రియాక్ట్ అయ్యింది. "తాను పెళ్లి చేసుకోబోయే వాడు సెన్సిబుల్ మ్యాన్ అయ్యుండాలి. సెన్సిటివ్‌గా ఉండటమే కాకుండా సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఉండాలి" అని అన్నది. తన డ్రీమ్‌బాయ్‌లో ఈ మూడు లక్షణాలుంటే సరిపోతుందని చెప్పింది. ఇంతకుమించి పెద్ద కోరికలేం లేవని పేర్కొన్నది.
రైట్ పర్సన్ ఎదురైతే...
సినిమాలను పెళ్లికి అడ్డంకిగా భావించడం లేదని చెప్పింది. రైట్ పర్సన్ ఎదురైతే పెళ్లి చేసుకొని కూడా సినిమాలను కంటిన్యూ చేస్తానని అన్నది. "కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక దాని కోసం మరో ఆనందాన్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. భవిష్యత్తు గురించి కొన్ని ప్రణాళికలు వేసుకున్నా. వాటి ప్రకారమే ముందుకు సాగాలని అనుకుంటున్నా" అని శ్రీలీల అన్నది. ప్రస్తుతానికైతే పెళ్లి గురించి ఆలోచించడం లేదని, ఆ రోజు ఎప్పుడొస్తుందో కూడా తెలియదంటూ బదులిచ్చింది. ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
తమిళంలో...
డిజాస్టర్ల కారణంగా తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీలీల ప్రస్తుతం తమిళంతో పాటు హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతోంది. కోలీవుడ్‌లో ధనుష్‌తో ఓం సినిమా చేస్తోంది. ప్రస్తుతం మలేషియాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ధనుష్, శ్రీలీలపై రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామి. ఈ తమిళ మూవీలో శ్రీలీలతో పాటు సాయిపల్లవి మరో హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది శ్రీలీల. తెలుగులో రీ ఎంట్రీ కోసం వెయిటింగ్ లో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | ఏడడుగులు వేశారు…హిట్టు కొట్టారు – పెళ్లి తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోహీరోయిన్లు వీళ్లే!
జులై 13, 2026

Deepika Padukone | సినిమాలకు బ్రేక్ – దీపికా పడుకోణ్ కోసం రణ్‌వీర్‌సింగ్ నిర్ణయం
జులై 13, 2026

Bhagyashri Borse | సేమ్ సీన్ రిపీట్ – మలయాళ బ్యూటీ ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సే – క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా!
జులై 13, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | దేశ విద్యావ్యవస్థ దోపిడీ యంత్రాంగంగా మారింది.. ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ
- ●Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య
- ●AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..
- ●Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల చేశాం
- ●KGBV Sangareddy Protest | ప్రిన్సిపాల్స్ 'ఈగో' వార్.. నడిరోడ్డుపై 200 మంది విద్యార్థినుల కన్నీటి ధర్నా!
- ●Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్రస్టు.. అర్హతలు ఇవే

Rahul Gandhi | దేశ విద్యావ్యవస్థ దోపిడీ యంత్రాంగంగా మారింది.. ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ

Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య

AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..

Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల చేశాం



